తేదీ 9.9.2021 కాళోజి నారాయణ రావు జయంతి ని పురస్కరించుకొని కాళోజి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పిస్తున్న జిల్లా కలెక్టర్ ఆర్. వి. కర్ణన్.

పత్రికా ప్రకటన తేదీ: 9-9-2021

ప్రజల మనిషి కాళోజి

-జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్

-కాళోజి జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు
O0000

 

తెలంగాణ భాష, యాస అస్తిత్వం అందించిన కాళోజీ ప్రజల మనిషి అని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ అన్నారు.

గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కాళోజీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అదనపు కలెక్టర్ లోకల్ బాడీ గరిమ అగర్వాల్, జడ్పీ సీఈఓ ప్రియాంక, ఇతర అధికారులు కాళోజి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కాళోజి జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకోవడం గొప్ప విషయమని తెలిపారు. పుట్టుక నీది చావు నీది బతుకంతా దేశానిది అని నినదించిన కాళోజి జీవితం అంతా తెలంగాణ భాషా సాహితీ సేవ దిశగా సాగిందని కొనియాడారు. కాళోజి నీ స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని కోరారు. జిల్లాకు వి. ఐ. పి, ఉన్నత అధికారులు వచ్చినప్పుడు పుష్పగుచ్చం ఇచ్చే బదులు మహనీయులు, గొప్ప నాయకులకు సంబంధించిన పుస్తకాలను బహుమతిగా అందచేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. దృశ్య మాధ్యమాన్ని వీక్షించడం కన్నా పుస్తక పఠనం వల్ల ఎంతో విజ్ఞానం పెంపొందుతుందని అన్నారు. జిల్లా కు అతిథులుగా వచ్చే వారికి జిల్లా అధికారులు పుస్తకాలను బహుమతిగా అందించాలని కోరారు. అంతకు ముందుగా కలెక్టరేట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద కాలుష్య నియంత్రణ మండలి సౌజన్యంతో ఏర్పాటుచేసిన మట్టి గణపతులను కలెక్టరేట్ సిబ్బందికి, ఉద్యోగులకు పంపిణి చేశారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని వాతావరణం కాలుష్యం కాకుండా ఉండేందుకు మట్టి గణపతులనే పూజించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్, జడ్పీ సీఈఓ ప్రియాంక, ముఖ్య ప్రణాళిక అధికారి కొమురయ్య, డి ఆర్ డి ఓ శ్రీలత, డిపిఓ వీర బుచ్చయ్య, బీసీ వెల్ఫేర్ అధికారీ రాజమనొహర్, మార్కెటింగ్ డి డి పద్మావతి, వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

సహాయ సంచాలకులు, జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం కరీంనగర్ వారిచే జారీ చేయడమైనది.

Share This Post