తేదీ::11.08.2021: వరంగల్ అర్బన్::జిల్లా కలెక్టరేట్ నందు గల స్టేట్ బోర్డు రూమ్(మినిస్టర్ రూం)లో స‌మీక్షా సమావేశం

తేదీ::11.08.2021: వరంగల్ అర్బన్:: రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి వర్యులు శ్రీ. ఎర్రబెల్లి దయాకరరావు గారు, రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ గారు వ‌రంగ‌ల్ అర్భ‌న్, వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లాల‌ను హ‌నుమ‌కొండ‌, వ‌రంగ‌ల్ జిల్లాలుగా మార్చేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం జీవో విడుద‌ల చేసిన సందర్భంగా జిల్లాల‌ పేర్లు మార్చుతూ, మండ‌లాల మార్పు,చేర్పుల‌పై ప్ర‌భుత్వం విడుద‌ల చేసి

ప్ర‌తిపాధ‌న‌ల‌పై ఇరు జిల్లాల ప్ర‌జ‌ల నుంచి అభ్యంత‌రాలు, సూచ‌న‌లు కోరగా, ఆయా జిల్లాల్లోని ప్ర‌జ‌ల నుండి వచ్చిన సూచ‌న‌లు, అభ్యంత‌రాల‌ గురించి జిల్లా కలెక్టరేట్ నందు గల స్టేట్ బోర్డు రూమ్(మినిస్టర్ రూం)లో స‌మీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ‌రంగ‌ల్ పశ్చిమ ఎమ్మెల్యే, ప్ర‌భుత్వ చీఫ్ విప్ ధాస్యం విన‌య్ భాస్క‌ర్‌ గారు, స్టేషన్ ఘ‌న్ పూర్ ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్య‌మంత్రి డా.టి.రాజ‌య్య‌గారు, ప‌ర‌కాల ఎమ్మెల్యే చ‌ల్లా ధ‌ర్మారెడ్డి గారు, వ‌రంగ‌ల్ అర్భ‌న్ జిల్లా ప‌రిష‌త్ చైర్మ‌న్ డా.సుధీర్‌కుమార్‌గారు, వ‌రంగ‌ల్ అర్భ‌న్‌ జిల్లా కలెక్టర్ శ్రీ. రాజీవ్ గాంధీ హన్మంతు గారు, రూర‌ల్ జిల్లా కలెక్ట‌ర్‌ హ‌రిత గారు పాల్గోన్నారు. DE, I&PR Dept, Warangal Urban.

Share This Post