తేమశాతం 17 కు తక్కువగా ఉంటేనే ధాన్యం కొనుగోలు చేయాలి…

ప్రచురణార్థం

తేమశాతం 17 కు తక్కువగా ఉంటేనే ధాన్యం కొనుగోలు చేయాలి…

మహబూబాబాద్ నవంబర్ 17.

తేమశాతం 17 కు తక్కువ ఉంటేనే ధాన్యం కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ శశాంక తెలిపారు.

బుధవారం కలెక్టర్ కార్యాలయంలో దాన్యం కొనుగోలు పై మండల స్థాయి అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు ధాన్యాన్ని విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాలకు తేగానే ముందు తేమ శాతం పరీక్షించాలని, శాంపిళ్లను సేకరించి కవర్లో భద్రపరచాలని వివరాలను రిజిస్టర్లో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.

ప్రతి కొనుగోలు కేంద్రంలో 30 టార్పాలిన్ లు, రెండు మాయిశ్చర్ మీటర్లు ప్యాడి క్లీనర్లు అందుబాటులో ఉంచుకోవాలని కలెక్టర్ సూచించారు.

జిల్లాలో 33 లక్షల గన్ని బ్యాగ్స్ అందుబాటులో ఉన్నాయన్నారు రవాణా కొరకు 25 కిలోమీటర్ల లోపు ట్రాక్టర్లు వినియోగించాలని ధాన్యం ఎక్కువగా ఉంటే లారీలు వినియోగించుకోవచ్చని అన్నారు ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్ ల ద్వారానే కొనుగోళ్లు జరపాలన్నారు దాన్యం కొనుగోలు ప్రక్రియ తప్పనిసరిగా ట్యాబ్ ఎంట్రీ చేయాలని తెలిపారు జిల్లాలో ధాన్యాన్ని రాకను బట్టి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని అన్నారు డిఆర్డిఏ 12 చోట్ల జిల్లా సహకార శాఖ ఆధ్వర్యంలో 16 సెంటర్లు నిర్వహణ జరుగుతుందన్నారు క్లస్టర్ల వారీగా వ్యవసాయ విస్తరణ అధికారులతో పాటు రైతుబంధు కోఆర్డినేటర్ లు పాల్గొనాలని,.రైతులకు ధాన్యం విక్రయాలపై అవగాహన కల్పించాలన్నారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ కొమరయ్య డిఆర్డిఎ పిడి సన్యాసయ్య dm civil supplies మహేందర్ పౌరసరఫరాల శాఖ అధికారి నరసింగరావు వ్యవసాయ అధికారి చత్రు నాయక్, సహకార శాఖ అధికారి ఖుర్షీద్, మార్కెటింగ్ అధికారి వెంకట రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
————————————————————————–
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post