తేమ శాతం ఉండి కొనుగోలు కేంద్రాలలో ధాన్యం నిల్వలు ఉంటే చర్యలు తీసుకుంటాం…

ప్రచురణార్థం

తేమ శాతం ఉండి కొనుగోలు కేంద్రాలలో ధాన్యం నిల్వలు ఉంటే చర్యలు తీసుకుంటాం…

మహబూబాబాద్ డిసెంబర్ 1:

తేమశాతం 17 ఉండి టోకెన్లు జారీ చేయకపోయినా ధాన్యం కేంద్రాలలో ఉన్న సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటానని జిల్లా కలెక్టర్ శశాంక స్పష్టం చేశారు.

బుధవారం మహబూబాబాద్ మున్సిపల్ పరిధిలోని నాలుగో వార్డు గాంధీపురంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించి పరిశీలించారు.

తేమ శాతం ఉండి కొనుగోలు జరపక పోవడం కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, కొనుగోళ్లలో జాప్యం సహించబోమన్నారు.

వ్యవసాయ అధికారులు పర్యవేక్షించాలన్నారు.వర్షానికి ధాన్యం తడిసిపోతే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటానన్నారు.

రైతులతో మాట్లాడుతూ గన్ని బ్యాగ్స్, టార్పాలిన్లు సిద్ధంగా ఉంచామని, ప్యాడి క్లినర్లు తో నాణ్యత ధాన్యాన్ని విక్రయించాలన్నారు. తరుగు తీయకుండా చర్యలు తీసు కుంటామన్నారు.

కలెక్టర్ వెంట తహసీల్దార్ రంజిత్, వ్యవసాయ అధికారి తిరుపతి రెడ్డి, గ్రామ రైతులు పాల్గొన్నారు.
—————————————————————————
జిల్లా పౌరసంబంధాల అధికారి, కార్యాలయం…మహబూబాబాద్ వారిచే జారిచేయనైనది.

Share This Post