తేమ శాతాన్ని ప్రతిరోజు నమోదు తెలియజేయాలి…

ప్రచురణార్థం

తేమ శాతాన్ని ప్రతిరోజు నమోదు తెలియజేయాలి…

కురవి
మహబూబాబాద్ డిసెంబర్ 6.

ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన రైతుల ధాన్యాన్ని ప్రతిరోజూ తేమ శాతం పరిశీలిస్తూ రికార్డుల్లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.

సోమవారం కురవి మండలం అయ్యగారి పల్లి గ్రామాన్ని సందర్శించి రైతు వేదిక లో ఏర్పాటుచేసిన రైతుల అవగాహన కార్యక్రమంలో పాల్గొని, ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత ఆహార సంస్థ ఎఫ్సీఐ ధాన్యం కొనుగోలు చేయలేమని తెలియజెప్పినందున రైతులు వరి పంటకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలు చేపట్టా లన్నారు.

కురవి మండలం సి కొత్తూరులో పామాయిల్ తోటల పెంపకం చేపట్టడం జరిగిందని అదేవిధంగా రైతులు ప్రత్యామ్నాయ పంటలు చేపట్టి ఆర్థిక అభివృద్ధి చెందాలని అన్నారు

ఆదర్శ రైతులు అర్థం చేసుకొని తోటి రైతులకు అవగాహన పరచాల్సిన అవసరం ఉందన్నారు ప్రత్యామ్నాయ పంటలతో అధిక దిగుబడి సాధిస్తున్న రైతుల విజయగాథలను కరదీపికగా ముద్రించి విస్తృత ప్రచారం చేయాలన్నారు.

వరి ధాన్యాన్ని విత్తనాల కొరకు మిల్లర్స్ కోరిక మేరకు వేసుకోవచ్చు నని సూచిస్తూ ఇకపై దాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవని ప్రభుత్వం కొనుగోలు చేయదని తెలిపారు.

ఆరుగాలం కష్టించే రైతు నష్టపోకూడదనే ఉద్దేశంతో జిల్లా అధికారులు సైతం గ్రామాల బాట పట్టారని రైతులకు విస్తృతంగా అవగాహన పరిచేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని రైతులు అర్థం చేసుకోవాల్సిందిగా కలెక్టర్ కోరారు.

అనంతరం కలెక్టర్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు తేమ శాతాన్ని పరిశీలిస్తే రికార్డులలో నమోదు చేస్తున్నారా లేదా అని రికార్డులు తనిఖీ చేశారు రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రానికి తెచ్చిన దగ్గరినుండి ప్రతిరోజు తేమ శాతాన్ని తప్పనిసరిగా నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సన్యా సయ్య వ్యవసాయ శాఖ అధికారి చత్రు నాయక్, ఉద్యాన శాఖ అధికారి సూర్యనారాయణ ఐకేపీ అధికారిని నళిని నారాయణ తాసిల్దార్ తరంగిణి ఎంపీడీవో ధన్ సింగ్ అయ్యగారి పల్లి సర్పంచ్ బజ్జురి జ్యోత్స్న సి కొత్తూరు సర్పంచ్ యానాల గంగాధర్ రెడ్డి రైతులు తదితరులు పాల్గొన్నారు
—————————————————————————
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post