తొర్రుర్ మునిసిపాలిటీని అందంగా తీర్చిదిద్దాలి….

ప్రచురణార్ధం

తొర్రుర్ మునిసిపాలిటీని అందంగా తీర్చిదిద్దాలి….

మహబూబాబాద్, 2021 డిసెంబర్-23:

తొర్రుర్ మునిసిపాలిటీని అందంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.

గురువారం కలెక్టర్ కార్యాలయ ప్రజ్ఞ సమావేశ మందిరంలో తొర్రూర్ మునిసిపాలిటి అభివృద్ధి పనులను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ తో కలిసి కలెక్టర్ సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తొర్రూరు మున్సిపాలిటీని అన్నివిధాల అభివృద్ధి పరచాలన్నారు.

వెజ్, నాన్ వెజ్ తొర్రూర్ మార్కెట్ పనులు వేగవంతంగా పూర్తి కావాలని, మిగతా పనుల నిమిత్తం కోర్టు కేసును తొందరగా క్లియర్ చేయాలని, మార్కెట్ ఉన్న ప్రాంతం నుండి సుమారు కిలో మీటర్ మేర రోడ్ల పైన కూరగాయలు విక్రయించ కుండ చూడాలని, అందరూ మార్కెట్ లో కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

మార్కెట్ స్థలం కేటాయింపుల్లో పారదర్శకత వహించాలని, నిజమైన లబ్దిదారులను గుర్తించి మార్కెట్ లో స్థలం కేటాయించాలన్నారు.

గతంలో మార్కెట్ ఉన్నప్రాంతంలో కూరగాయలు విక్రయించిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.

కుటుంబంలో ఒకే వ్యక్తికి కేటాయించే విధంగా చూడాలన్నారు.

బయటి ప్రదేశాల్లో దూర ప్రాంతాల్లో కూడా outlet లను కూడా ఏర్పాటు చేసే విధంగా ఆలోచించాలన్నారు.

పట్టణ ప్రాంతంలో చేయవల్సిన అభివృధి కార్యక్రమాలకు సంబంధించి, వార్డ్ ల వారీగా చేయవలసిన పనులు, కావాల్సిన నిధుల కు వివరాలతో ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించారు. చేయవల్సిన పనులపై మ్యాప్ ద్వారా వివరించాలని తెలిపారు.

పట్టణ ప్రగతిలో భాగంగా జంక్షన్ ల అభివృధి, అర్చిలు, పబ్లిక్ toilets, park పనులను చేపట్టాలని తెలిపారు. వైకుంఠ ధామం పనులు పూర్తి చేయాలన్నారు.

Road widening పనులను అడిగి తెలుసుకుంటూ సమగ్ర నివేదికలు తయారు చేయాలన్నారు.

మినీ టాంక్ బండ్ పనులు వేగవంతం కు చర్యలు తీసుకోవాలన్నారు.
త్రాగునీటి సౌకర్యం పై సమీక్షించారు.

రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతంగా చేపట్టాలని, డంపింగ్ యార్డ్ పనులు పూర్తి చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో తొర్రూరు మునిసిపల్ చైర్మన్ రామచంద్రయ్య, మునిసిపల్ కమీషనర్ గుండె బాబు, తహశీల్దార్ రాఘవరెడ్డి, సర్వే అధికారులు తదితరులు పాల్గొన్నారు.
——————————————————
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, మహబూబాబాద్ చే జారీ చేయనైనది.

Share This Post