తొలి కాన్పులు ప్రభుత్వ ఆసుపత్రులలోనే జరిగేలా చూడాల్సిన బాధ్యత వైద్యాధికారులదే – ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో నార్మల్ డెలివరీ ల సంఖ్యను పెంచాలి – మొదటి కాన్పుల పై ప్రత్యేక దృష్టి సారించాలి – జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

తొలి కాన్పులు ప్రభుత్వ ఆసుపత్రులలోనే జరిగేలా చూడాల్సిన బాధ్యత వైద్యాధికారులదే   – ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో నార్మల్ డెలివరీ ల సంఖ్యను పెంచాలి   – మొదటి కాన్పుల పై ప్రత్యేక దృష్టి సారించాలి   – జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

తొలి కాన్పులు ప్రభుత్వ ఆసుపత్రులలోనే జరిగేలా చూడాల్సిన బాధ్యత వైద్యాధికారులదే

– ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో నార్మల్ డెలివరీ ల సంఖ్యను పెంచాలి

– మొదటి కాన్పుల పై ప్రత్యేక దృష్టి సారించాలి

– జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

——————————-
సిరిసిల్ల 23, జూలై 2022
——————————-
తొలి కాన్పులు ప్రభుత్వ ఆసుపత్రులలోనే జరిగేలా చూడాల్సిన బాధ్యత వైద్యాధికారులదే నని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు.
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలు పెంచాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు.
సాధారణ ప్రసవాలు పెంచేందుకు
క్రమం తప్పకుండా పురోగతి పై సమీక్ష సమావేశాలు నిర్వహించాలని అన్నారు.

శనివారం సాయంత్రం కలెక్టరేట్ మినీ మీటింగ్ హల్ లో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..
జిల్లాలో 46 శాతం ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రులలో, 54 శాతం ప్రసవాలు ప్రైవేట్ ఆస్పత్రులలో జరుగుతున్నాయని తెలిపారు.
సాధ్యమైనంత ఎక్కువగా ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రులలో జరిగేలా చూడాలన్నారు.

క్షేత్రస్థాయిలో ఇప్పటికే ఆశా, అంగన్‌వాడీ, ఆరోగ్య కార్యకర్తల సమన్వయంతో ప్రతి గర్భిణీ వివరాలను నమోదు చేస్తున్నారనీ తెలిపారు. రెండో నెల నుంచి కాన్పు జరిగే వరకు గర్భిణీ ఆరోగ్య స్థితిపై ఆరోగ్యశాఖ పర్యవేక్షణ కొనసాగేలా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ చర్యలు తీసుకోవాలన్నారు. గర్భిణులకు ఏఎన్‌సీ నమోదు సందర్భంలో సాధారణ ప్రసవం అయ్యేలా మోటివేషన్‌ చేయాలన్నారు. యోగా, ఫిజియోథెరపీపై అవగాహన కల్పించాలన్నారు.

వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న దృష్ట్యా సీజనల్ వ్యాధులపై వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. లార్వా అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి పారిశుద్ధ్య కార్యక్రమాలను క్రమం తప్పకుండా జరిగేలా చూడాలన్నారు.
జ్వర పీడితులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను హైరిస్కు ప్రాంతాలను గుర్తించి దోమ లార్వా నిర్మూలన కార్యక్రమాలు, పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలన్నారు.
వర్షాకాలంలో ప్రజలు అధికంగా డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వంటి రెగ్యులర్ ఫీవర్ కేసుల బారిన పడే అవకాశం ఉన్న దృష్ట్యా జ్వర పీడితులను గుర్తించేందుకు టెస్టుల సంఖ్యను మరింతగా పెంచాలన్నారు.

ప్రికాషనరీ డోస్ లో జిల్లా వెనుకంజలో ఉందని
కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రికాషనరీ డోస్ లో వేగం పెంచాలని ఆదేశించారు. సబ్ సెంటర్ వారిగా లక్ష్యాలను ఇచ్చి అర్హులందరికీ డోసు త్వరితగతిన ఇచ్చేలా చూడాలన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో, అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆర్‌బీఎస్‌కే (రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం) క్రింద నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం
బృందాలు వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి స్క్రీనింగ్‌ పిల్లలకు పుట్టుకతో వచ్చే లోపాలు గుర్తించడంతో పాటు వివిధ అనారోగ్య సమస్యలున్న విద్యార్థులను గుర్తించి చికిత్సలు అందించాలని అన్నారు.

అలాగే జిల్లాలో క్షయ వ్యాధి బాధితులను గుర్తించి వారికి మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలన్నారు.

ఈ హెల్త్ ప్రొఫైల్ సర్వే లో ఇంకా స్క్రీనింగ్ కానీ వ్యక్తులను గుర్తించి వెంటనే స్క్రీనింగ్ చేయాలన్నారు.

*ఉత్తమ వైద్యులకు ప్రశంసా పత్రాలు*
అన్ని పారామీటర్లలో ఉత్తమ పనితీరు కనబరిచిన వైద్యాధికారులకు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రశంసా పత్రంతో పాటు జ్ఞాపిక అందించి సత్కరిస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు.

సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ బి సత్య ప్రసాద్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు జిల్లా ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్ మురళీధర్ రావు, వేములవాడ ఏరియా ఆసుపత్రి పర్యవేక్షకులు డా. మహేష్ రావు , జిల్లాలోని అన్ని uphc, phc వైద్యాధికారులు పాల్గొన్నారు.

Share This Post