త్రి I లపై గట్టిగా నిలబడితే…. అగ్రశ్రేణి దేశంగా భారత్:రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు

 

త్రి I లపై గట్టిగా నిలబడితే….
అగ్రశ్రేణి దేశంగా భారత్

– ఆవిష్కరణలకు వేదికలుగా తెలంగాణ “హబ్” లు నిలుస్తున్నాయి

– సమ్మిళిత అభివృద్ధిలో తెలంగాణ దేశానికి చిరునామా

– మంత్రి శ్రీ కే తారక రామారావు

భారతదేశం అభివృద్ధి చెందిన అగ్రశ్రేణి దేశాల సరసన నిలబడాలంటే ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్టక్చర్, ఇంక్లుసివ్ గ్రోత్ అనే మూడు అంశాల పై గట్టిగా నిలబడితేనే సాధ్యం అవుతుందనీ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు.

సోమవారం వజ్రోత్సవాల వేడుకల్లో పాల్గొన్న అనంతరం సిరిసిల్ల కలెక్టరేట్ లో
ఇంటింటా ఇన్నోవేటర్‌ ఎగ్జిబిషన్‌–2022ను మంత్రి శ్రీ కే తారక రామారావు ప్రారంభించారు.
అనంతరం ఇంటింటా ఇన్నోవేటర్‌ ఎగ్జిబిషన్‌–2022 ద్వారా ఎంపిక చేసిన 33 జిల్లాల ఆవిష్కరణ ల అవిష్కర్తల తో సిరిసిల్ల కలెక్టరేట్ నుండి గూగుల్ మీట్ ద్వారా మాట్లాడారు.

సృజనాత్మకతే నూతన ఆవిష్కరణలకు మూలమని, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింటా ఇన్నోవేటర్‌ కార్యక్రమం సమ్మిళిత ఆవిష్కరణల అభివృద్ధికి సాక్ష్యంగా నిలుస్తోందని అన్నారు.
ఈ ఎగ్జిబిషన్‌ ద్వారా ఎంపిక చేసిన ఆవిష్కరణలు తోటి భారతీయుల నిజమైన సమస్యల ఆధారంగా రూపుదిద్దుకున్నాయని పేర్కొన్నారు. అందుకు ఉదాహరణ నే సిరిసిల్ల జిల్లా నుంచి ఎంపికైన ప్రదర్శన లే చక్కని ఉదాహరణ అని పేర్కొన్నారు.

ప్రపంచంలో అత్యధిక యువత ఉన్న దేశంగా భారత కు ప్రత్యేకత ఉందన్నారు. యువత ను సరైన దిశలో పెడితే మంచి ఫలితాలు వస్తాయన్నారు.

తెలంగాణ ప్రభుత్వం పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో ముందుంది అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టి – హబ్, వి – హబ్, అగ్రి – హబ్, కే – హబ్, బి – హబ్ అనేక కొత్త ఆవిష్కరణలకు వేదికలు అవుతున్నాయని తెలిపారు.

అంతే కాకుండా సమ్మిళిత అభివృద్ధిలో తెలంగాణ దేశానికి చిరునామా ఉందన్నారు.
సంక్షేమం , అభివృద్ధికి సమ ప్రాధాన్యతను ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ నేనని మంత్రి తెలిపారు. పల్లె, పట్టణాలు అభివృద్ధిలో జొడెద్దులుగా ముందుకు సాగుతూ… కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అనేక అవార్డులు రివార్డులు ను సొంతం చేసుకుంటున్నాయని అన్నారు. మరో వైపు పర్యావరణo , పరిశ్రమలు రెండు ఏకకాలంలో అభివృద్ధి చెందుతున్నా యనీ చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ సహా అనేక సాగు ప్రాజెక్ట్ ల నిర్మాణంతో 107 శాతం వ్యవసాయ విస్తరణ జరిగిందన్నారు. గ్రీన్ కవర్ 7.7 శాతం. పెరిగిందన్నారు.

టాలెంట్ ఎవ్వరి అబ్బ సొత్తు కాదని.. యువతను సరైన పంథాలో వెళ్లేలా మార్గదర్శనం చేస్తూ..అవసరమైన సౌకర్యాలు కల్పిస్తే… దేశానికే ఇన్నోవేషన్ క్యాపిటల్ గా ఇండియా మారుతుందన్నారు.

గూగుల్ మీట్ లో జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ రాహుల్ హెగ్డే, జిల్లా అదనపు కలెక్టర్ లు బి సత్య ప్రసాద్, ఖీమ్యా నాయక్, Telangana State Innovation Cell Chief Innovation Officer Dr. Shanta Thoutam ,GM industries offer K.Upender Rao,DEO Dr.D. Radhakishan,DSO V.Anjaneylu తదితరులు పాల్గొన్నారు.

 

Share This Post