త్వరలో అర్హులకు కొత్త పెన్షన్లు మంజూరు: రాష్ట్ర ఐ. టి.శాఖ మంత్రి కే. తారకరామారావు

 

*త్వరలో అర్హులకు కొత్త పెన్షన్ లు మంజూరు*

– ఒక్కా పైసా లంచం లేకుండా…. ఇండ్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్ల ను కేటాయిస్తున్నాం

– దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకూ 20 వేల కోట్ల తో 2 లక్షల 70 వేల డబుల్ బెడ్ ఇండ్లు నిర్మించాం

– పేదల కోసం డబుల్ బెడ్ రూం ఇండ్ల ను నిర్మిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ నే

– 560 చదరపు అడుగుల విస్తీర్ణంతో పేదలకు నాణ్యమైన ఇండ్లు నిర్మిస్తున్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే

– ఇండ్లు లేని నిరుపేదలకు సిఎం కేసిఆర్ గారి కానుక డబుల్ బెడ్ రూం ఇండ్లు

– పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా తెలంగాణ పల్లెలను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుకున్నాం

– రైతు బంధు , రైతు భీమా,
సాగుకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్, రైతు వేదికలు, నర్సరీ లు ఇలా అనేక రైతు సంక్షేమ పథకాలను అమలు పరుస్తున్నాo

– రైతు బంధు పథకం క్రింద ఇప్పటి వరకూ 50 వేల కోట్ల పంట పెట్టుబడి క్రింద సహాయo ను రైతుల ఖాతాలో జమ చేశాం

– తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలను పేద ప్రజలు సద్వినియోగం చేసుకోనీ ఆర్థిక స్వాలంబన సాధించాలి

– *రాష్ట్ర మంత్రి శ్రీ కే తారక రామారావు*

సిరిసిల్ల 10 మే 2022 :

త్వరలో అర్హులైన వారందరికీ కొత్త పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయనుందని రాష్ట్ర మంత్రి శ్రీ కే తారక రామారావు తెలిపారు.

మంగళవారం ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్లపేటలో రూ. 10 కోట్ల 8 లక్షలతో నిర్మించిన 16 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కు
రాష్ట్ర మంత్రి శ్రీ కే తారక రామారావు ప్రారంభోత్సవం చేశారు.

అనంతరం డబుల్ బెడ్ రూం ఇండ్ల ను ప్రారంభించిన అనంతరం కేసిఆర్ నగర్ లో లబ్ధిదారుల తో కలిసి మంత్రి సహపంక్తి భోజనం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…

దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకూ 20 వేల కోట్ల తో 2 లక్షల 70 వేల డబుల్ బెడ్ ఇండ్లు నిర్మించిందనీ అన్నారు.

ఒక్కా పైసా లంచం లేకుండా…. అత్యంత పారదర్శకంగా ఇండ్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్ల ను కేటాయిస్తుందని అన్నారు.

పేదల కోసం 560 చదరపు అడుగుల విస్తీర్ణంతో పేదలకు నాణ్యమైన
డబుల్ బెడ్ రూం ఇండ్ల ను నిర్మిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ నే అని అన్నారు.

ఇండ్లు లేని నిరుపేదలకు సిఎం కేసిఆర్ గారి కానుక డబుల్ బెడ్ రూం ఇండ్లు అని అన్నారు. పేదలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా తెలంగాణ పల్లెలను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుకున్నామని అన్నారు.

రైతు బంధు , రైతు భీమా,
సాగుకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్, రైతు వేదికలు, నర్సరీ లు ఇలా అనేక రైతు సంక్షేమ పథకాలను అమలు పరుస్తున్నామని చెప్పారు.

రైతు బంధు పథకం క్రింద ఇప్పటి వరకూ 50 వేల కోట్ల పంట పెట్టుబడి క్రింద సహాయo ను రైతుల ఖాతాలో జమ చేశామని అన్నారు.

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలను పేద ప్రజలు సద్వినియోగం చేసుకోనీ ఆర్థిక స్వాలంబన సాధించాలన్నారు.

కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి ఎన్ అరుణ, జిల్లా కలెక్టర్ శ్రీ అనురాగ్ జయంతి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

——————————

Share This Post