*త్వరలో జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన నేపధ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన:: జిల్లా కలెక్టర్ జి.రవి*

ప్రచురణార్థం—1

తేదీ.13.12.2021

*త్వరలో జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన నేపధ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన:: జిల్లా కలెక్టర్ జి.రవి*
*త్వరలో జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన నేపధ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన:: జిల్లా కలెక్టర్ జి.రవి*

జగిత్యాల, డిసెంబర్ 13:- జిల్లాలో త్వరలో సీఎం కేసీఆర్ పర్యటన ఉండే నేపథ్యంలో చేయాల్సిన ఏర్పాట్లను కలెక్టర్ సోమవారం పరిశీలించారు. జిల్లా లో నూతనంగా నిర్మించబడిన సమీకృత కలెక్టరేట్ , మాతా శిశు ఆస్పత్రి, మెడికల్ కాలేజ్, టి.ఆర్.ఎస్. పార్టీ భవనాల ప్రారంభోత్సవ& శంకుస్థాపన కార్యక్రమాలకు గౌరవ ముఖ్యమంత్రి త్వరలో పర్యటన చేసే అవకాశం ఉన్నందున ఈ పర్యటన సందర్భముగా నిర్మాణ పనులు హెలిప్యాడ్ మరియు మోతే ప్రాంతంలో పబ్లిక్ మీటింగ్ ప్రదేశాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్.

నూతన కలెక్టరేట్ భవనం లో మరియు సి ఎం పర్యటించే ప్రదేశాల చుట్టూ మొత్తం పచ్చదనంతో, అనవసరపు చెట్ల పొదలను తొలగించి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని మున్సిపల్ కమిషనర్ మరియు ఇతర అధికారులను ఆదేశించారు.

ఈ పర్యటనలో జిల్లా ఎస్పీ శ్రీమతి సింధుశర్మ, స్థానిక సంస్థల అధనపు కలెక్టర్ శ్రీమతి జె. అరుణశ్రీ, జగిత్యాల ఆర్డిఓ శ్రీమతి ఆర్.డి. మాదురి,ఆర్&బి ఈఈ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్, వివిధ శాఖల & పోలీస్ అధికారులు, తసీల్ధార్ పాల్గోన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి జగిత్యాల చే జారీ చేయనైనది

Share This Post