త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా పర్యటన సందర్భంగా వీరాయిపల్లీ, కొత్తపల్లి తండా, కర్నేతాండ ఏర్పాట్లను పరిశీలించిన : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన,    తేది:14.12.2021, వనపర్తి.

త్వరలో వనపర్తి జిల్లాకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష ఆదేశించారు.
మంగళవారం ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా వీరాయిపల్లీ, కొత్తపల్లి తండా, కర్నేతాండ ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెలలో ముఖ్యమంత్రి వనపర్తి జిల్లా పర్యటనలో భాగంగా కర్నే తాండ దగ్గర హెలిప్యాడ్ కు అన్ని సౌకర్యాలు సిద్ధం చేయాలని, ఆర్ అండ్ బి శాఖ, ఇరిగేషన్ సిబ్బందికి ఆమె సూచించారు. రహదారి పొడవున హరితహారం మొక్కలు నాటి, అందంగా తీర్చిదిద్దాలని డి ఆర్ డి ఎ, డి ఎల్ పి ఓ.లకు ఆమె తెలిపారు. వీరాయపల్లి, కొత్తపల్లి తండాలలో వ్యవసాయ అధికారులు, ఆర్ అండ్ బి శాఖ అధికారులు పంచాయతీ రాజ్ అధికారులు అన్ని చర్యలు చేపట్టి ఏర్పాట్లు పూర్తిచేయాలని ఆమె తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా అన్ని ఏర్పాట్లు త్వరగా పూర్తిచేయాలని సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ సూచించారు.
జిల్లా కలెక్టర్ వెంట అటవీశాఖ అధికారి, ఆర్ అండ్ బి అధికారి, పంచాయతీరాజ్ అధికారి, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
…………
జిల్లా పౌర సంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post