త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా పర్యటన సందర్భంగా ఎకో పార్క్, చిట్యాల రోడ్డు, నాగవరం తాండ, రాజాపేట ప్రాంతాల ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశిష్ సంగ్వాన్

పత్రికా ప్రకటన.   తేది:18.12.2021, వనపర్తి.

త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా పర్యటన సందర్భంగా వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు.
శనివారం వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఎకో పార్క్, చిట్యాల రోడ్డు, నాగవరం తాండ, రాజాపేట ప్రాంతాలను జిల్లా అదనపు కలెక్టర్ పర్యటించి, ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పర్యటన సందర్భంగా వనపర్తి జిల్లాలో వివిధ ప్రాంతాలలో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని మున్సిపల్ కమిషనర్ కు, అధికారులకు ఆయన సూచించారు. రోడ్డు వెంబడి మొక్కలు నాటి అందంగా తీర్చిదిద్దాలని, సభా ప్రాంగణంలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా తగు జాగ్రత్తలు చేపట్టాలని, పనులలో ఎలాంటి జాప్యం లేకుండా త్వరిత గతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆయన వివరించారు. ముఖ్యమంత్రి పర్యటన లో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ఏర్పాట్లు పూర్తిచేయాలని ఆయన సూచించారు.
జిల్లా అదనపు కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, మున్సిపల్ సిబ్బంది, వార్డు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
………..
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post