త్వరితగతిన బ్యాంక్ అధికారులు రుణ వితరణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా వార్షిక ప్రణాళిక పైసమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు.2022-23 ఆర్థిక సంవత్సరానికి రుణ వితరణ బ్యాంకుల ద్వారా రూ.4700 కోట్లు కేటాయించారని చెప్పారు. వీటిలో రూ.4284 కోట్లు ప్రాధాన్యత రంగాలైన వ్యవసాయం, వాణిజ్యం, విద్య, గృహ రుణాలు, మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక రంగాలకు కేటాయించినట్లు చెప్పారు. జిల్లాలో91.16 శాతం రుణ వితరణ పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. వీధి వ్యాపారులకు బ్యాంకుల ద్వారా రుణాలు అందజేశామని తెలిపారు. ప్రభుత్వ పథకాలు అర్హులకు అందేవిధంగా బ్యాంకు అధికారుల సహకారం అందించాలని కోరారు. అన్ని రంగాలకు రుణాలు సమర్థవంతంగా అందినప్పుడే జిల్లా అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. స్వయం సహాయక సంఘాలకు రుణాలు అందించడంలో బ్యాంకర్లు ముందు వరుసలో ఉన్నారని చెప్పారు. జిల్లా వార్షిక రుణ ప్రణాళిక పుస్తకాలను ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. సమావేశంలో లో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, లీడ్ బ్యాంక్ మేనేజర్ రమేష్, బ్యాంక్ అధికారులు, ఐకెపి అధికారులు, మెప్మా అధికారులు పాల్గొన్నారు. —————— జిల్లా సమాచార, పౌర సంబంధాల అధికారి కార్యాలయం కామారెడ్డి చే జారీ చేయనైనది.