త్వరితగతిన మిల్లుల వద్ద ధాన్యం దిగుమతి చేయాలి:: జిల్లా కలెక్టర్ జి.రవి

పత్రికాప్రకటన..2 తేదిః 09-12-2021
త్వరితగతిన మిల్లుల వద్ద ధాన్యం దిగుమతి చేయాలి:: జిల్లా కలెక్టర్ జి.రవి
జగిత్యాల డిసెంబర్ 9:- జిల్లాలో రైస్ మిల్లుల వద్ద ధాన్యం దిగుమతి త్వరితగతిన చేసుకోవాలని, ఈ విధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి.రవి సంబంధిత అధికారులను ఆదేశించారు.సుమారు 25 రైస్ మిల్లుల వద్ద ధాన్యం నిల్వలు దిగుమతులు చేయకుండా అధికంగా ఉండటం పై కలెక్టర్ గురువారం సంబంధిత సివిల్ సప్ప్లై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.
జిల్లాలో ధాన్యం దిగుబడి అంచనా వేసుకుని కమిషనర్ సివిల్ సప్ప్లై ఆదేశాల మేరకు మిల్లింగ్ సామర్థ్యం ప్రకారం మాత్రమే మిల్లులకు కేటాయించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. రైస్ మిల్లు వద్ద ధాన్యం దిగుమతి ఆలస్యం కావడం పట్ల డిసెంబర్ 4న 10వేల ఎం.టి. కంటే తక్కువ కోనుగోలు చేసిన 32 మంది రైస్ మిల్లులకు నోటీసులు జారీ చేసామని కలెక్టర్ తెలిపారు.
32 మందికి నోటీసులు జారీ చేయగా అందులో 5 మినహా మిగిలిన మిల్లర్లలో 10వేల లోపు దిగుమతి చేయడం జరుగుతుందని అధికారులు వివరించారు. రైస్ మిల్లులతో పలుమార్లు సమావేశంలు నిర్వహించుకోవడం జరిగినప్పటికీ కొంత మంది మిల్లర్లు ఆలస్యంగా దిగుమతులు చేసే వారిని గుర్తించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.
జిల్లాలో మిల్లులకు నోటీసులు జారీ చేసినప్పటికీని కొన్ని రైస్ మిల్లు లో ధాన్యం దిగుమతి ఏమాత్రమూ వేగవంతం చేయడం లేదని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మిల్లులలో కెపాసిటీ మేరకు మాత్రమే కేటాయించడం జరుగుతుంది.మిల్లు వారీగా దిగుమతి లో జాప్యానికి కారణాలు, నెక్స్ట్ 10 రోజుల్లో రోజుకూ 2000 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుమతి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.రైస్ మిల్లుల వైఖరి లో ఏలాంటి మార్పు లేకపోతే కఠిన చర్యలు తీసుకోబడుతాయని కలెక్టర్ హెచ్చరించారు.

త్వరితగతిన మిల్లుల వద్ద ధాన్యం దిగుమతి చేయాలి:: జిల్లా కలెక్టర్ జి.రవి

జిల్లా పౌర సంబంధాల అధికారి జగిత్యాల చే జారీ చేయనైనది

Share This Post