థర్డ్ వేవ్ వచ్చినా ఆక్సిజన్ సమస్య రాకుండా చర్యలు – మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

 

బాల్కొండ నియోజకవర్గం (నిజామాబాద్) జనవరి 5:–

కరోనా మూడవ వేవ్ వచ్చినా ఏ ఒక్క పేదవాడు కూడా ఆక్సిజన్ దొరక్క ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో పలు మండలాల్లోని ఆరోగ్య కేంద్రాలు ఐ సి యు బెడ్స్ ఏర్పాటు చేయడం జరిగిందని రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, శాసనసభ వ్యవహారాలు, గృహ నిర్మాణ శాఖల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.

బుధవారం నాడు మోర్తాడ్ మండల కేంద్రంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో 5 ఐ సి ఓ బెడ్స్, 25 ఆక్సిజన్ బెడ్స్ ప్రారంభించారు. ₹ 12.50 లక్షల వ్యయంతో నిర్మించనున్న మార్చురీ భవనానికి భూమి పూజ చేశారు.
మోర్తాడ్ మండలం/తిమ్మాపూర్/పాలెం/Donkal/ గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వైద్య రంగంలో ప్రభుత్వం అన్ని రకాల సేవలందించడానికి ఏర్పాట్లు చేసింది అన్నారు. హాస్పిటల్ లో ఉన్న ఖాళీలను 15 రోజుల్లో భర్తీ చేయాలని ముఖ్యమంత్రి గారు నిన్ననే ఆదేశాలు ఇచ్చారన్నారు.
బాల్కొండ, మోర్తాడ్ హాస్పిటల్ లను నిన్న వైద్య విధాన పరిషత్తుకు మార్చి ఉత్తర్వుల GO వచ్చిందని, దీని వల్ల ఈ 2 హాస్పిటలల్లో స్పెషలిస్ట్ డాక్టర్లు వస్తారు అన్నారు.
గౌరవ ముఖ్యమంత్రి గారు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వైద్య రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని దీంట్లో తమ వంతుగా మిత్రులు, తన సతీమణి సహకారంతో కోటి యాభై లక్షల రూపాయలతో గ్రామీణ హాస్పిటల్స్ లోనే సౌకర్యాలు మెరుగుపరుచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది అన్నారు.
గ్రామీణ ప్రాంత ప్రజల కు వైద్య పరంగా ఇబ్బందులు ఉండకూడదని ఆక్సిజన్ బెడ్స్ ఏర్పాటు చేయడం జరిగిందని, సిలిండర్ ఆక్సిజన్ ప్లాంట్ 60 లక్షలతో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మెండోర, బాల్కొండ, భీమ్గల్, వేల్పూర్, కమ్మర్పల్లిలలో ఆక్సిజన్ పంపిణీకి బాట్లింగ్ యూనిట్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
మోర్తాడు, బాల్కొండ, వేల్పూర్ హాస్పిటలల్లో 18 ఐసియు బెడ్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
ఒమీక్రాన్ కరోనా థర్డ్ వేవ్ వచ్చినా ఏ ఒక్క పేదవాడు కూడా ఆక్సిజన్ దొరక్క ఇబ్బంది పడకూడదనే హాస్పిటలల్లో ఆక్సిజన్ బెడ్స్, ఐసియు బెడ్స్ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
పేదవాడు ప్రభుత్వ ఆస్పిటల్ లకు పోవాలనిపించే విధంగా తయారు చేయాలని అనుకున్నామని సక్సెస్ అయినామన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, డి ఎం హెచ్ ఓ సుదర్శనం, జిజిహెచ్ సూపరిండెంట్ ప్రతి మరాజ్, ఆర్ డి ఓ శ్రీనివాస్ తహసిల్దార్ శ్రీధర్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post