దమ్మూరు, సర్వాయిపేట, ముకునూరు గ్రామాల్లో ఆకస్మికంగా పర్యటించి గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకున్న జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య

* ప్రచురణార్థం *
జయశంకర్ భూపాలపల్లి జూలై 30(శుక్రవారం).

శుక్రవారం జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఏటూరునాగారం ఐటీడీఏ పీవో హనుమంత్ జెండగే తో కలిసి పలిమెల మండలంలోని దమ్మూరు, సర్వాయిపేట, ముకునూరు గ్రామాల్లో ఆకస్మికంగా పర్యటించి గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా దమ్మురు గ్రామంలో త్రీఫేస్ కరెంటు లేక పోవడం మూలంగా ఇబ్బంది కలుగుతుందని అలాగే పోడు భూములకు పట్టాలు ఇప్పించాలని గిరిజన గ్రామస్తులు కలెక్టర్ ను కోరగా స్పందించిన కలెక్టర్ వెంటనే త్రి ఫేస్ కరెంటు వచ్చేలా చర్యలు చేపట్టాలని ఐటీడీఏ పీవో హనుమంత్ జెండగే ను ఆదేశించారు. అదేవిధంగా 2005 కన్నా ముందు పోడు భూములను సాగు చేసుకుంటున్న గిరిజనులను పరిశీలించి తగు చర్యలు చేపడతామని జిల్లా కలెక్టర్ అన్నారు. గిరిజన యువతతో మాట్లాడుతూ ఆన్లైన్ క్లాసులు ఎలా జరుగుతున్నాయి అని తెలుసుకొని చదువు వలన అభివృద్ధి ఉంటుంది కాబట్టి కచ్చితంగా అందరూ కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరాలని అన్నారు. తెలంగాణకు హరితహారంలో ఎవెన్యూ ప్లాంటేషన్ ద్వారా రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలు చిన్నగా ఉన్నాయని డిఆర్డిఎ తో మాట్లాడి పెద్ద మొక్కలు తీసుకొచ్చి రోడ్లకు ఇరువైపులా నాటాలని అలాగే సర్వాయిపేట ఆర్ అండ్ బి రోడ్డు గుంతలు పడినందున గ్రామ పంచాయతీ నిధులతో వెంటనే గుంతలను పూడ్చాలని ఎంపీడీవో ప్రకాష్ రెడ్డి ని ఆదేశించారు. ముకునూరులో త్రాగునీటి ప్రాబ్లం మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేకపోవడం వలన వైద్యం కోసం సుదూరంలో ఉన్న అంబటిపల్లి, మహాదేవపూర్, ఏటూరునాగారం, కన్నాయిగూడెం తదితర ప్రాంతాలకు కష్టాలకు ఓర్చి వెళ్ళవలసి వస్తుంది కాబట్టి పలిమెలలో పిహెచ్ సి ఏర్పాటు చేయాలని జెడ్పిటిసి ప్రేమలత, మరియు ఎంపీపీ బుచక్కలు కోరగా రేపు శనివారం ఆర్డబ్ల్యూఎస్ మరియు మిషన్ భగీరథ అధికారులతో సర్వాయిపేటలో సమావేశం నిర్వహించి త్రాగునీటి సమస్యలు తీర్చాలని అధికారులను ఆదేశించారు. పలిమెలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటుకు పరిశీలిస్తానని జిల్లా కలెక్టర్ తెలిపారు.
ఈ పర్యటనలో తాసిల్దార్ శ్రీనివాస్,ఎంపిఓ నాగేందర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి, తాసిల్దార్ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ శివ, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

—————————————————————————————–

డిపిఆర్ఓ జయశంకర్ భూపాలపల్లి జిల్లా గారిచే జారీ చేయడమైనది.

 

Share This Post