దళితబందు గ్రౌండింగ్, యూనిట్లు ఎంపికపై దృష్టిసారించాలి జిల్లాకలెక్టర్ ఆర్.వి. కర్ణన్

దళితబందు గ్రౌండింగ్, యూనిట్లు ఎంపికపై  దృష్టిసారించాలి

జిల్లాకలెక్టర్ ఆర్.వి. కర్ణన్

0 0  0 0

     జిల్లాలో దళితబంధు గ్రౌండింగ్ మరియు యూనిట్ల ఎంపికపై ప్రత్యేకాధికారులు దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి కర్ణన్ అన్నారు.

     శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో  దళితబంధు గ్రౌండింగ్ మరియు లబ్దిదారుల  యూనిట్ల ఎంపికపై కరీంనగర్, హుజురాబాద్, చోప్పదండి, మానకొండూర్ నియోజక వర్గాల  గ్రౌండింగ్ అధికారులు, మున్సిపల్ కమీషనర్లతో జిల్లా కలెక్టర్  సమీక్షించచారు.   ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ దళితబంధు లబ్దిదారులకు గ్రౌడింగ్ త్వరగా పూర్తిచేసి యూనిట్ల ఎంపికలో అలస్యం జరగకుండా  చూడాలని,  ఎంపిడిఓలు, మున్సిపల్ కమీషనర్లు ఇందులో పెండింగ్ ఉన్న లబ్దిదారులకు యూనిట్ల ఎంపికపై అవగాహన కల్పించి యూనిట్లు త్వరగా మంజూరు చేయాలని ఆదేశించారు.  దళితబంధు క్రింద మంజూరైన సెంట్రింగ్, టెంట్ హౌజ్, కిరాణం, మిని సూపర్ మార్కెట్  మొదలగు యూనిట్లను పరిశీలించి నివేదికను సమర్పించాలని అన్నారు.  ప్రత్యేకాధికారులు ప్రత్యేకదృష్టిని సారించి త్వరితగతిన గ్రౌండింగ్ అయ్యేలా చూడాలన్నారు.

          ఈ కార్యకమ్రంలో అదనపు కలెక్టర్ జి.వి శ్యాంప్రసాద్ లాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్, మున్సిపల్ కమీషనర్ సేవా ఇస్లావత్,  వెనకబడిన తరగతుల అధికారి రాజమనోహార్ రావు, షెడ్యూల్ కూలల అభివృద్ది అధికారి నతానియల్, డిఆర్డిఓ శ్రీలతారెడ్డి,  పౌరసరఫరాల అధికారి శ్రీమాల, మార్కెట్ కమిటి అధికారి పద్మావతి,  సెరికల్చర్ అధికారి శ్రీనివాస్, జియం ఇండస్ట్రీస్ నవీన్, పిడి మెప్మా రవీందర్, కార్మికశాఖ అధికారి రవీందర్,  ఎల్డియం ఆంజనేయులు, జిల్లా నేహుయువ కేంద్రం కోఆర్డినేటర్ రాంబాబు, యంపిడిఓలు, మున్సిపల్ కమీషనర్లు పాల్గోన్నారు.

Share This Post