దళితబందు యూనిట్లను సద్వినియోగం చేసుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ లబ్ధిదారులకు సూచించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ చింతకాని మండలం వందనం గ్రామంలో దళితబందు పథకం లబ్ధితో చేపట్టిన యూనిట్లను పరిశీలించారు.

దళితబందు యూనిట్లను సద్వినియోగం చేసుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ లబ్ధిదారులకు సూచించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ చింతకాని మండలం వందనం గ్రామంలో దళితబందు పథకం లబ్ధితో చేపట్టిన యూనిట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వందనం గ్రామంలో దళితబందు లబ్దిదారులు నిర్వహిస్తున్న డెయిరీ, ట్రాక్టర్, ట్రాలీ ఆటో, మెడికల్, ఎలక్ట్రికల్, సెంట్రింగ్, మోబైల్ క్యాంటిన్ యూనిట్లను కలెక్టర్ పరిశీలించారు. నిర్వహణ, ఆదాయం వివరాలను అడిగి తెలుసుకున్నారు. డెయిరీ యూనిట్లను ఎప్పటికప్పుడు పశుసంవర్ధక శాఖ వైద్యులు పర్యవేక్షించాలని, లబ్ధిదారులకు పాటించవలసిన సలహాలు, సూచనలు తెలియచేయాలన్నారు. అనంతరం నర్సింహాపురం గ్రామంలో ట్రాన్స్పోర్ట్ యూనిట్లకు సంబందించిన హార్వెస్టర్లను కలెక్టర్ తనిఖీ చేసారు ఈ సందర్భంగా కలెక్టర్ లబ్దిదారులతో ప్రభుత్వం దళితులు అభివృద్ధికి చేపట్టిన సంక్షేమ పథకంతో ఆర్థికంగా స్థిరపడాలని లబ్ధిదారులు నలుగురికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని అన్నారు.

స్థానిక సంస్థల అదనపు కలెక్టరు స్నేహలత మొగిలి, శిక్షణ కలెక్టర్ రాధిక గుప్తా, గ్రామా స్పెషల్ ఆఫీసర్ సిద్దార్థ్ విక్రంసింగ్, ఎస్సీ కార్పోరేషన్ ఈ.డి ఏలూరి శ్రీనివాసరావు, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వేణుమనోహర్, మండల ప్రత్యేక అధికారి శిరీష, జిల్లా రవాణా శాఖ అధికారి టి.కిషన్రెఉవ, పంచాయిరాజ్ ఇ.ఇ కె.వి.కె.శ్రీనివాస్ రావు, ఎం.పి.డి.ఓ శ్రీనివాసరావు, తహశీల్దారు మంగిలాల్, గ్రామ సర్పంచ్ సునిత, కార్యదర్శి మహేష్, తదితరులు ఉన్నారు.

Share This Post