దళితబందు లబ్దిపొంది యూనిట్ ప్రారంభించని వారిపై చర్యలు తీసుకోండి
జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్
0 0 0 0
దళితబందు పథకం ద్వారా లబ్దిపొంది యూనిట్ ప్రారంభించని వారికి నోటీసులను జారీ చేసి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ అన్నారు.
గురువారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో దళితబందు యూనిట్ల మంజూరిపై సంబంధిత క్లస్టర్ అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో దళితబందు పథకం ద్వారా లబ్దిని పొంది యూనిట్ల స్థాపనలో నిర్లక్ష్యంగా వ్యవహిరించే వారికి నోటీసులను జారిచేయాలని, అప్పటికి స్పందించక పోతే దళితబందును రద్దుచేయాలని తెలిపారు. యూనిట్ల మంజూరులో అధికారులు క్షుణ్ణంగా పరిశీలిలించిన తరువాతే తదుపరి అనుమతులను ఇవ్వాలని, యూనిట్ల ఎంపికలో లబ్దిదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఎస్ కె ఎస్ సర్వేలో ఉండి ప్రస్తుతం కూడా ఉన్నవారికి, రేషన్ కార్డు ఉన్నవారికి పథకం మంజూరుకు సానుకూలంగా వ్యవహరించాలని సూచించారు. ఎటువంటి ఆధారం లేకుండా నిరాధారులుగా జీ్వించేవారికి, వృద్దులకు, మనవండ్లు మరియు మనవరాళ్లకు పథకం మంజూరు చేయరాదని సూచించారు. తక్కువ ఆదాయం ఉన్న రిటైర్డు ఉద్యొగులకు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ వారికి కూడా పథకాన్ని వర్తింపజేయాలని సూచించారు. సరైన పత్రాలను, ఆధారాలను చూపించని వారి దరఖాస్తు తిరస్కరించే ముందు క్షుణ్ణంగా పరిశీలించాలని తెలిపారు.
ఈ కార్యక్రముంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, జడ్పీ సిఈఓ ప్రియాంక, ఈడి ఎస్సి కార్పోరేషన్ అధికారి సురేష్, క్లస్టర్ అధికారులు, ఇతర అధికారులు పాల్గోన్నారు.