దళితబంధును సద్వినియోగం చేసుకొని సంపదను పెంపొందించుకోవాలి.. ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి

దళితబంధును సద్వినియోగం చేసుకొని సంపదను పెంపొందించుకోవాలి.. ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి

దళితులు కూడా సమాజంలో ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దళితబంధు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని ,ఈ అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకొని సంపద పెంపొందించుకోవాలని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. గత ప్రభుత్వాలు షెడ్యూల్డ్ కులాల వారిని ఆర్థికంగా, సామాజికంగా ముందుకు తీసుకురాలేక పోయాయని వారు కూడా సమాజంలో గౌరవప్రదంగా జీవించేందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో మేధోమధనం చేసి దళితబందు పధకానికి రూపకల్పన చేశారని అన్నారు. సోమవారం హవేలీ ఘనపూర్ మండలం జక్కన్నపేట్ లో మినీ డైరీ యూనిట్ లబ్ధిదారులు షెడ్లు నిర్మించుకోవడానికి ఎమ్మెల్యే భూమి చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇలాంటి పధకం దేశంలోని ఏ రాష్ట్రంలో లేదని అన్నారు. ఈ కార్యక్రమం జిల్లాలో ఎంతో ఆదర్శవంతంగా కొనసాగుతున్నదని అన్నారు.గత సంవత్సరం ప్రయోగాత్మకంగా చేపట్టిన దళిత బంధు పధకం క్రింద మెదక్ నియోజక వర్గంలో 100 యూనిట్లు అందజేస్తున్నామని అన్నారు. అందులో భాగంగా జక్కన్నపేట్ లో 18 యూనిట్లు మంజూరు కాగా నలుగురు లబ్ధిదారులు మినీ డైరీ యూనిట్ల స్థాపనకు ఆసక్తి చూపారని, అట్టి యూనిట్ల గ్రౌండింగ్ గాను మొదటగా షెడ్ల నిర్మణానికి శంఖుస్థాపన చేసుకుంటున్నామని అన్నారు. దళితులకు ఆర్థిక స్వాలంబన కల్పించడం కోసం ప్రభుత్వం అందిస్తున్న చేయుతను చక్కగా వినియోగించుకొని ఆర్థికంగా ఎదగడంతో పాటు కుటుంబాన్ని చక్కగా పోషించుకుంటూ, పిల్లల్ని బాగా చదివించాలని అభిలషించారు. త్వరలో నియోజక వర్గంలో 1500 యూనిట్లు అందించనున్నామని వారికి మీరే మార్గదర్శులుగా ఆదర్శంగా నిలవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి విజయలక్ష్మి, జిల్లా పరిషద్ వైస్ చైర్ పర్సన్ లావణ్య రెడ్డి, ఏం.పి .పి . నారాయణ్ రెడ్డి, ఏం.పి .డి.ఓ., సర్పంచు,ప్రజాప్రతినిధులు , తదితరులు పాల్గొన్నారు.

Share This Post