దళితబంధుపై సమీక్ష జరిపి,అధికారులకు దిశానిర్దేశం చేసిన మంత్రి కొప్పుల ఈశ్వర్

*ఎస్సీల జీవితాలలో వెలుగులు నింపేందుకు కేసీఆర్ దళితబంధు తీసుకువచ్చారు: మంత్రి కొప్పుల ఈశ్వర్*

 

*ఇటువంటి పథకం గతంలో ఎక్కడా కూడా లేదు, దీనిని యజ్ఞం మాదిరిగా ముందుకు తీసుకుపోతున్నం: మంత్రి కొప్పుల ఈశ్వర్*

 

*ఇప్పటివరకు 24,046 యూనిట్లు గ్రౌండింగ్ చేయగా,35,642 కుటుంబాలు లబ్ధి పొందాయి: మంత్రి కొప్పుల ఈశ్వర్*

 

*ఇందుకోసం రూ.3,048 కోట్లు ఖర్చయ్యాయి: మంత్రి కొప్పుల ఈశ్వర్*

 

*దళితబంధుపై సమీక్ష జరిపి,అధికారులకు దిశానిర్దేశం చేసిన మంత్రి కొప్పుల ఈశ్వర్*

 

*సమావేశంలో ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహూల్ బొజ్జా,ఎస్సీ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు*

 

*హైదరాబాద్:* అనాదిగా వివక్షకు, నిరాదరణకు గురైన ఎస్సీల జీవితాలలో వెలుగులు నింపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ “దళితబంధు” పథకానికి రూపకల్పన చేసి,ఒక యజ్ఞం మాదిరిగా ముందుకు తీసుకుపోతున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు.ఈ పథకం తీరుతెన్నులపై మంత్రి హైదరాబాద్ లోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం సమీక్ష జరిపారు.ఇది అద్భుతమైనది, ఇటువంటి పథకం గురించి మనం గతంలో కనీవిని ఎరుగం అని,దీనికి రూపకల్పన చేసి విజయవంతంగా అమలు చేస్తున్న కేసీఆర్ గొప్ప పాలనాదక్షులన్నారు.సుమారు రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహూల్ బొజ్జా, ఎస్సీ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాహూల్ బొజ్జా ఇప్పటివరకు 24,046 యూనిట్లు గ్రౌండింగ్ అయ్యాయని,35,642 కుటుంబాలకు లబ్ధి చేకూరిందని, ఇందుకు రూ.3,048 కోట్లు ఖర్చయ్యాయని మంత్రికి చెప్పారు.వీటిలో హూజూరాబాద్ నియోజకవర్గంలో 11,647,ఆలేరు నియోజకవర్గానికి చెందిన వాసాలమర్రిలో 71,చింతకాని,తిర్మలగిరి,చారగొండ, నిజాంసాగర్ మండలాలలో 6,685,అన్ని జిల్లాల్లో 8,507 యూనిట్లు, మొత్తంగా 24,046 గ్రౌండింగ్ అయ్యినట్లు తెలిపారు.ఈ పథకం గురించి మరింత అవగాహన కల్పించాలని,లబ్ధిదారులు సద్వినియోగం చేసుకునేలా అధికారులు బాధ్యతతో వ్యవహరించే విధంగా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు.

Share This Post