దళితబంధు పథక లబ్ధిదారులకు యూనిట్ల గ్రౌండింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు.

ప్రచురణార్థం

ఖమ్మం, జూలై 26:

దళితబంధు పథక లబ్ధిదారులకు యూనిట్ల గ్రౌండింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో అధికారులతో దళితబంధు పధకం పురోగతిపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ, దళితబంధు మంజూరు యూనిట్ల గ్రౌండింగ్ కి అధికారులు క్రియాశీలకంగా పనిచేయాలన్నారు. చింతకాని మండలంలో 909 యూనిట్లను గ్రౌండింగ్ చేశామన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల్లో 456 మంది లబ్ధిదారులకు గాను 390 యూనిట్లను గ్రౌండింగ్ చేశామని ఆయన తెలిపారు. సత్తుపల్లి నియోజకవర్గంలో వంద శాతం గ్రౌండింగ్ జరిగినట్లు కలెక్టర్ అన్నారు. మిగతా చోట్ల డెయిరీ, గొర్రెల యూనిట్లను గ్రౌండింగ్ చేయాల్సి ఉందని, సీజన్ దృష్ట్యా ఆలస్యం అయినట్లు, 3 వారాల్లో ప్రక్రియ పూర్తి కానున్నట్లు ఆయన తెలిపారు. కొన్నిచోట్ల కిరాణా, రెడీమేడ్ డ్రస్సుల యూనిట్లు ఉన్నట్లు, ఇట్టి వాటిని వెంటనే గ్రౌండింగ్ చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. యూనిట్ల గ్రౌండింగ్ ప్రక్రియ ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో నమోదు చేయాలన్నారు. గ్రౌండింగ్ ప్రక్రియ పూర్తి చేసి, లబ్ధిదారులకు త్వరితగతిన అందజేయాలన్నారు

ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మొగిలి స్నేహాలత, ఇడి ఎస్సి కార్పొరేషన్ శ్రీనివాసరావు, జెడ్పి సిఇఓ అప్పారావు, జిల్లా ఉపాధికల్పన అధికారి శ్రీరాం, జిల్లా వైద్య ఆరోగ్యాధికారిని డా. మాలతి, జిఎం ఇండస్ట్రీస్ అజయ్ కుమార్, జిల్లా పశు సంవర్ధక అధికారి డా. వేణు మనోహర్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post