*దళితబంధు పధకంతో ఆర్థికంగా పైకెదగాలి:: రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల సహకార అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ బండ శ్రీనివాస్

*దళితబంధు పధకంతో ఆర్థికంగా పైకెదగాలి:: రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల సహకార అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ బండ శ్రీనివాస్

*ప్రచురణార్థం-4*

*దళితబంధు పధకంతో ఆర్థికంగా పైకెదగాలి:: రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల సహకార అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ బండ శ్రీనివాస్*

జయశంకర్ భూపాలపల్లి, ఏప్రిల్ 23: ప్రభుత్వం అమలుచేస్తున్న దళితబంధు పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా పైకెదగాలని రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల సహకార అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ అన్నారు. శనివారం మహాముత్తారం మండల ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో దళితబంధు లబ్దిదారులకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో చైర్మన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లబ్దిదారులు స్వంతంగా ఎవరిపై ఆధారపడకుండా ఎవరికి వారే నిర్వహించుకోగల్గె పథకాన్ని ఎంపిక చేసుకోవాలని అన్నారు. పథకంలో ఉన్న యూనిట్స్ పై వివరించి చైర్మన్ వారికి అవగాహన కల్పించారు. యూనిట్ ఎంపిక దీర్ఘకాలిక లాభం ఇచ్చేదిగా ఉండాలన్నారు. యూనిట్ నిర్వహణపై సంబంధిత అధికారులు శిక్షణ ఇస్తారన్నారు. ఒక ప్రాంతంలో ఒకేరకమైన యూనిట్లను ఎంపిక చేసుకోవద్దని, దీంతో పోటీ ఎక్కువై లాభసాటిగా ఉందని అన్నారు. ఆయా రంగాల్లో ముందస్తు అనుభవమున్న యూనిట్ల ఎంపికతో నిర్వహణ సులువై లాభాలుంటాయన్నారు. ఉంటున్న ప్రాంతంలో ఏ ఏ యూనిట్లకు డిమాండ్ ఉందో పరిశీలన చేసి, ఆయా యూనిట్లపై మొగ్గుచూపాలన్నారు. ప్రభుత్వం పూర్తిగా ఉచితంగా, తిరిగి కట్టాల్సిన అవసరం లేకుండా ఈ మొత్తాన్ని అందజేస్తున్నదని ఛైర్మన్ తెలిపారు.

ఈ కార్యక్రమములో ఇడి ఎస్సి కార్పొరేషన్ వెంకటేశ్వర్లు, జెడ్పిటిసి శారద, మండల ఎంపిడిఓ, తహసీల్దార్లు, మహాముత్తారం మండలానికి చెందిన 20 మంది, పలిమెల మండలానికి చెందిన 10 మంది లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు.
———————————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి, జయశంకర్ భూపాలపల్లి కార్యాలయంచే జారిచేయనైనది.

Share This Post