దళితబంధు పధకం క్రింద చింతకాని మండలం నేరడ గ్రామానికి చెందిన బండ్ల యోహాను, బండ్ల కనకరాజ్, మంచాల రమేష్, కందుల శాంతయ్య లకు ఉమ్మడి యూనిట్ క్రింద మంజూరయిన అజాక్స్ మిషన్ ను కలెక్టరేట్ ఆవరణలో జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ శనివారం లబ్ధిదారులకు అందజేశారు.

ప్రచురణార్థం

ఖమ్మం, జూలై 30:

దళితబంధు పధకం క్రింద చింతకాని మండలం నేరడ గ్రామానికి చెందిన బండ్ల యోహాను, బండ్ల కనకరాజ్, మంచాల రమేష్, కందుల శాంతయ్య లకు ఉమ్మడి యూనిట్ క్రింద మంజూరయిన అజాక్స్ మిషన్ ను కలెక్టరేట్ ఆవరణలో జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ శనివారం లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ యూనిట్ ను పరిశీలించి, నిర్వహణ విషయమై లబ్ధిదారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అందించిన సహకారాన్ని సద్వినియోగం చేసుకొని, కష్టపడి పనిచేసి, ఆర్థికంగా స్థిరపడాలని ఆయన లబ్ధిదారులకు సూచించారు.

ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహక అధికారి వి. వి. అప్పారావు, ఖమ్మం రెవిన్యూ డివిజనల్ అధికారి రవీంద్రనాథ్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డు సహాయ సంచాలకులు వి. రాము, నేరడా ఉప సర్పంచ్ గోపి తదితరులు ఉన్నారు.

Share This Post