దళితబంధు ప్రతి దళిత కుటుబం జీవితంలోనే ఒక మైలురాయి కావాలని, దళితబంధు పథకం చేశానికే దిక్సూచిగా నిలవాలని రాష్ట్ర సాంఘిక, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ అన్నారు.

ప్రచురణార్ధం

ఏప్రిల్ 26 ఖమ్మం:–

దళితబంధు ప్రతి దళిత కుటుబం జీవితంలోనే ఒక మైలురాయి కావాలని, దళితబంధు పథకం దేశానికే దిక్సూచిగా నిలవాలని రాష్ట్ర సాంఘిక, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలంతో పాటు ఐదు నియోజకవర్గాలలోని దళితబందు లబ్దిదారులకు మంగళవారం సాయంత్రం నగరంలోని ఎస్.ఆర్.అండ్.బి.జి.ఎన్.ఆర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన దళితబందు యూనిట్ల పంపిణీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయకుమార్తో కలిసి మంత్రి కొప్పుల ఈశ్వర్ లబ్దిదారులకు యూనిట్లను పంపిణీ చేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ దళిత వర్గాలు సమాజంలోని అన్ని వర్గాలకు సమానంగా నిలవాలని దళితుల జీవతాలలో మార్పు రావాలని గౌరవ ముఖ్యమంత్రివర్యులు సుధీర్ఘంగా గొప్ప ఆలోచన చేసి  దళితబంధుకు శ్రీకారం చుట్టారని ప్రభుత్వ కల్పించిన అవకాశాన్ని సద్వినియోగపర్చుకొని దళిత ఆర్థికాభివృద్ధి సాధించడంతో పాటు మరో పది మందికి ఉపాధి కల్పించే విధంగా లక్షాధికారి నుండి కోటీశ్వరులుగా ఎదగాలని మంత్రి అన్నారు. చింతకాని మండలంతో పాటు ఖమ్మం జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు సంబంధించి నేడు 520 మంది లబ్ధిదారులకు వివిధ రకాల యూనిట్లను అందజేస్తున్నట్లు మంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత డా॥బి. ఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో అక్షరమే ఆయుధం కావాలనే నినాధంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 268 సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్ను ప్రారంభించిందని తద్వారా ప్రతి సంవత్సరం లక్షా 82 వేల మంది విద్యార్థులు ఇట్టి పాఠశాలల నుండి కార్పోరేటుకు ధీటుగా ఫలితాలు సాధిస్తున్నారని మంత్రి అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 30 మహిళా డిగ్రీ కళాశాలలు తెలంగాణ. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని మంత్రి అన్నారు. దళితబంధుకు ఎటువంటి ఆంక్షలు, నిబంధనలు లేవని ప్రతి దళితకుటుంభానికి దళితబంధు అందుతుందని రాష్ట్రంలోని 17 లక్షల మంది కుటుంబాలకు దళితబంధు మైలురాయి కావాలని మంత్రి అన్నారు.

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయకుమార్ మాట్లాడుతూ నవ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కె.చంద్రశేఖర్రావు ప్రవేశ పెట్టే ప్రతి పథకం రాజకీయాలకు అతీతంగా ఉంటుందని. దళితబంధు కూడా ఇదే విధంగా కేవలం ప్రజలతో మాత్రమే సంబంధం కలిగిఉందన్నారు. రాష్ట్రంలో ఎంపిక అయిన నాలుగు మండలాలో ఖమ్మం జిల్లా చింతకాని మండలం పయిలెట్ ప్రాజెక్టుగా ఎంపిక కావడం పట్ల అందరి చూపు చింతకాని మండలం వైపే ఉందన్నారు. అట్టడుగు స్థాయిన ఉన్న దళితవాదల్ని బంగారు. మేడలుగా చేయాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రివర్యుల కృత నిశ్చయమని మంత్రి అన్నారు. పేదరికం నుండి దళిత వర్గాలను బయటకు తీసుకురావడానికి గతంలో ఏ ప్రభుత్వాలు సాహసం చేయలేదని దళితబంధును ఒక పథకంలా కాకుండా ఉద్యమంలా ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా మంత్రి అన్నారు. లబ్ధిదారులు తాము ఎంపిక చేసుకున్న రంగాల ద్వారా ఆర్థిక ప్రగతి సాధించి సమాజంలో మరొకరికి ఆదర్శంగా నిలవాలన్నారు. దళితబంధు లబ్ధిదారులు ఆర్ధికంగా నష్టపోయిన యెడల వారిని మరొక సారి ఆదుకునేందుకు దళిత రక్షణ నిధిని ప్రభుత్వ ఏర్పాటు చేసిందని మంత్రి తెలిపారు. సమాజంలోని అన్ని వర్గాల వారు దళిత కుటుంబాలకు అండగా నిలవాలని ప్రతి నియోజకవర్గంలో సంబంధిత శాసనసభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు దళితబంధు లబ్దిదారులకు అండగా ఉండాలని మంత్రి అన్నారు.

జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో జరిపిన ఇంటింటి సర్వే ద్వారా 347 దళిత కుటంబాలను గుర్తించామని మండలంలోని 26 గ్రామ పంచాయితీలకు గాను 10 గ్రామ పంచాయితీలలో రెండు వందలకు పైగా దళిత కుటంబాలు ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. చింతకాని మండలంతో పాటు ఐదు నియోజక వర్గాలలో నియోజకవర్గానికి వంద కుటుంబాల చొప్పున ఎంపిక చేసిన లబ్దిదారులకు లాభసాటి. ఆసక్తి, అనుభవం, నైపుణ్యత కలిగిన యూనిట్ల స్థాపనకు గాను గ్రామ ప్రత్యేక అధికారులచే సంపూర్ణ అవగాహన కల్పించామని, ఇప్పటికే వివిధ రకాల 57 యూనిట్లను లబ్ధిదారులు, ఎంపిక చేసుకోవడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ప్రధానంగా ఇద్దరు లేక ముగ్గురు లబ్ధిదారులు కలిసి పెద్ద యూనిట్లు స్థాపించేందుకు కల్పించిన అవగాహన ద్వారా 220 మంది లబ్ధిదారులు కలిసి 70 యూనిట్లు, హర్వేస్టర్లు, జే.సి.బిలు స్థాపించుకునేందుకు ముందుకు వచ్చారని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. దీనితో పాటు 284 మంది డైరీ యూనిట్ల స్థాపనకు ముందుకు వచ్చారని వీరందరూ షెడ్ల నిర్మాణాలు, పశుగ్రాసం పెంపకం తదితర పనులలో నిమగ్నమై ఉన్నారని కలెక్టర్ అన్నారు. దీనితో పాటు సెంట్రింగ్, ఫోటోగ్రఫీ, అల్యూమీనియం, డి.జె సౌండ్ సిస్టమ్ తదితర యూనిట్లను నేడు లబ్ధిదారులకు అందిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.

మధిర శాసనసభ్యులు మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలంలో దళితబంధు పథకాన్ని లబ్దిదారులకు అందించడంలో జిల్లా మంత్రివర్యులతో పాటు జిల్లా అధికార యంత్రాంగం విజయం సాధించిందని ఇదే జిల్లా వ్యాప్తంగా పథకాన్ని అమలు పర్చాలని ఆయన అన్నారు. యూనిట్ల స్థాపనలో అనుభవం లేని లబ్ధిదారులకు ఓరియంటేషన్ కార్యక్రమం ఏర్పాటు చేయడంతో పాటు మార్కెటింగ్ అవకాశాల పట్ల సూచనలు సలహాలు అందించాలని ఆయన అన్నారు.

సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ దళితబంధు లబ్ధిదారులు ప్రభుత్వ కల్పించిన అవకాశాన్ని సర్వినియోగం చేసుకుంటూ యూనిట్లు తీసుకోవడంలో చూపిన ఉత్సాహాన్ని యూనిట్లను సక్రమంగా సర్వేనియోగ పర్చుకొని తద్వార నలుగురు స్ఫూర్తి పొందేలా ఉండాలని ఆయన అన్నారు. దళితబంధు పథకంకు సంబంధించి అవాస్త ప్రచారాలను నమ్మవద్దని ప్రతి దళిత కుటుంబానికి దళితబంధు వర్తిస్తుందని తెలిపారు. జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు మాట్లాడుతూ దళితుల ఆత్మ గౌరవాన్ని తలెత్తుకునే విధంగా గౌరవ ముఖ్యమంత్రివర్యులు దళిత మేధావులు, నాయకులతో సుధీర్ఘంగా చర్చించి దళితబంధుకు శ్రీకారం. చుట్టారని ఆయన అన్నారు. 70 సంవత్సరాల స్వతంత్ర భారత దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఎటువంటి పూచికత్తు, సబ్సిడీ లేకుండా పూర్తిగా ఉచితంగా ప్రతి దళితకుటుంబానికి 10 లక్షల రూపాయలు. అందించి వారు ఆర్ధికాభివృద్ధి సాధించేందుకు గాను బడ్జెట్లోనే 17 వేల 5 వందల కోట్లు కేటాయించారని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.

శాసనమండలి సభ్యులు తాతా మధుసూదన్, అలుగుబెల్లి నర్సిరెడ్డి, వైరా శాసనసభ్యులు లావుణ్య రాములు నాయక్, నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయకుమార్, ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీ ప్రసన్న, రఘునాథపాలెం జడ్పీ, టి.సి మాలోతు ప్రియాంక, సర్పంచ్లు, జడ్పీ, టి.సిలు, ఎం.పి.పి.లు, కార్పోరేటర్లు, అదనపు కలెక్టర్లు స్నేహలత మొగిలి, ఎన్. మధుసూదన్, ఎస్సీ కార్పోరేషన్ ఇది కె.సత్యనారాయణ, గ్రామ ప్రత్యేక అధికారులు, సెక్టార్ గ్రౌండింగ్ అధికారులు లబ్దిదారులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Share This Post