దళితబంధు మంజూరులో ఇంకనూ గ్రౌండింగ్ కాని యూనిట్లను త్వరితగతిన గ్రౌండింగ్ చేయాలని జిల్లా కలెక్టర్

: దళితబంధు మంజూరులో ఇంకనూ గ్రౌండింగ్ కాని యూనిట్లను త్వరితగతిన గ్రౌండింగ్ చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. సోమవారం జిల్లా ప్రజాపరిషత్ సమావేశ మందిరంలో అధికారులతో కలెక్టర్ దళితబంధు కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మంజూరు యూనిట్లకు వంద శాతం మొత్తం వారి వారి ఖాతాల్లో జమ చేసినట్లు, లబ్ధిదారులు ఎంపిక చేసిన యూనిట్ల సేకరణకు చర్యలు వేగం చేయాలన్నారు. కార్ యూనిట్ల గ్రౌండింగ్ విషయమై చర్యలు చేపట్టి, ఈ నెల 10 లోగా కనీసం 70 యూనిట్లు గ్రౌండింగ్ అయ్యేలా చూడాలన్నారు. గొర్రెల యూనిట్ల విషయమై చర్యలు వేగం చేయాలన్నారు. పైలట్ ప్రాజెక్ట్ క్రింద ఎంపికయిన చింతకాని మండలంలో 3421 మంది లబ్ధిదారుల్లో, ఇప్పటి వరకు 1606 యూనిట్ల గ్రౌండింగ్ చేసినట్లు, 710 యూనిట్ల సేకరణకు ప్రక్రియ ఆమోదించినట్లు ఆయన తెలిపారు. ఈ వారంలో సేకరణ ప్రక్రియ పూర్తి చేసిన యూనిట్ల గ్రౌండింగ్ లక్ష్యంగా కార్యాచరణ చేసి పూర్తి చేయాలన్నారు. యూనిట్ల గ్రౌండింగ్ ఎప్పటికప్పుడు ఆన్లైన్ అప్డేట్ పూర్తి చేయాలన్నారు. గ్రౌండింగ్ అయిన యూనిట్ల నిర్వహణ విషయమై అధికారులు పర్యవేక్షణ చేయాలని, లబ్ధిదారులకు తగు సూచనలు, సహాయ సహకారాలు అందించాలని ఆయన తెలిపారు. యూనిట్ల సమస్యలు ఉంటే పరిష్కరించాలన్నారు. ప్రత్యేక అధికారులు క్రియాశీలకంగా వుండి, గ్రౌండింగ్ ప్రక్రియ త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహాలత మొగిలి, ఖమ్మం ఆర్డీవో రవీంద్రనాథ్, జెడ్పి సిఇఓ అప్పారావు, ఇడి ఎస్సి కార్పొరేషన్ శ్రీనివాసరావు, జిల్లా రవాణాధికారి కిషన్ రావు, జిల్లా వ్యవసాయ అధికారిణి విజయ నిర్మల, జిల్లా ఉపాధికల్పనాధికారి శ్రీరామ్, జిల్లా పశుసంవర్ధక అధికారి డా. వేణు మనోహర్, ఇఇ పీఆర్ శ్రీనివాసరావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post