దళితబంధు యూనిట్లను పక్కడ్బందీగా గ్రౌండింగ్ చేయాలని జిల్లా కలెక్టర్ నిఖిల అధికారులను ఆదేశించారు.
బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో గ్రౌండింగ్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, దళితుల అభ్యున్నతి, ఆర్థిక అభివృద్ధి కొసం రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు ప్రవేశపెట్టి అమలు చేస్తుందన్నారు. వికారాబాద్ నియోజకవర్గంలో 100 మందిని, తాండూర్ లో 100, పరిగిలో 80, కొడంగల్ లో 60, చేవెళ్ల నియోజకవర్గంలోని నవాబుపేటలో 18 మంది మొత్తం జిల్లాలో 358 మంది లబ్దిదారులను ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు 274 మంది లబ్ధిదారులకు రూ.27.27 కోట్ల నిధులను వారి ఖాతాలకు జామచేయడం జరిగిందని తెలియజేసినారు. వివిధ రకాల వ్యాపారాలు నిర్వహించుకొనుటకు గాను అద్దె చెల్లింపులుల కొరకు అడ్వాన్స్ గా లక్ష రూపాయలు అందజేయాలన్నారు. ట్రాన్స్ పోర్ట్ విభాగమునకు సంబంధించిన చెల్లింపులు వెంటనే పూర్తి చేయాలన్నారు. మరో 76 మంది పౌల్ట్రీ, డైరీ తదితర నిర్వహణకు కూడా నిధులు అందెంచేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
ఈ సమావేశంలో ఎస్సి కార్పొరేషన్ ఈడి బాబూమోజెస్, డిప్యూటీ సిఇఓ సుభాషిణి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోపాల్, పశు సంవర్ధక శాఖ అధికారి అనిల్ కుమార్ ఎల్డియం రాంబాబు, యంవిఐ జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు.