దళితబంధు యూనిట్ల గ్రౌండింగ్ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ విపి. గౌతమ్

ప్రచురణార్ధం

మే 25 ఖమ్మం

దళితబంధు యూనిట్ల గ్రౌండింగ్ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలి :: జిల్లా కలెక్టర్ విపి. గౌతమ్

జిల్లాలో దళితబంధు యూనిట్ల గ్రౌండింగ్ ప్రక్రియలో వేగం పెంచి, త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ ప్రజ్ఞ సమావేశ మందిరంలో సెక్టార్ యూనిట్ గ్రౌండింగ్ అధికారులతో దళితబంధు యూనిట్ల గ్రౌండింగ్ పై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, దళితబంధు యూనిట్ల లబ్ధిదారులకు ఆయా యూనిట్లపై పూర్తి అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో 621 యూనిట్లను గ్రౌండింగ్ చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ట్రాన్స్ పోర్ట్ యూనిట్ల లబ్దిదారులకు శిక్షణ ఇచ్చి, లైసెన్స్, నిర్వహణ విషయమై చైతన్యం కల్పించాలన్నారు. ఒకే తరహా యూనిట్ల గ్రౌండింగ్ కాకుండా విభిన్న రకాల యూనిట్ల గ్రౌండింగ్ ప్రక్రియ సమాంతరంగా చేపట్టాలన్నారు. ఇంకనూ ప్రతిపాదనలు సమర్పించి, నిధుల విడుదలకు చర్యలు చేపట్టని యూనిట్ల విషయంలో కొటేషన్ తదితర ప్రక్రియను వేగంగా పూర్తిచేసి వెంటనే సమర్పించాలన్నారు. ఒక గ్రామంలో ఒకే తరహా యూనిట్లు, ఎక్కువ మొత్తంలో మంజూరుకు చూడకుండా, ఆయా యూనిట్ల డిమాండ్ను బట్టి చర్యలు తీసుకోవాలని. ఆయన అన్నారు. సమీక్షలో యూనిట్ల వారిగా గ్రౌండింగ్ కు ఎంత సమయం పడుతుందని వివరాలను సంబంధిత సెక్టార్ యూనిట్ గ్రౌండింగ్ అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు

సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహాలత మొగిలి, ఇంచార్జ్ ఇది. ఎస్సీ కార్పొరేషన్ శ్రీరామ్, జిల్లా పరిషత్ సిఇఓ వి. అప్పారావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయ నిర్మల, ఎడి హార్టికల్చర్ అనిత, జిల్లా రవాణాధికారి కిషన్ రావు, పరిశ్రమల శాఖ జిఎం. అజయ్ కుమార్, పంచాయతీ రాజ్ ఇ.ఇ.లు. చంద్రమౌళి, శ్రీనివాస్, ఆర్ అండ్ బి శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు శ్యామ్ ప్రసాద్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post