దళితబంధు లబ్దిదారులు తమకు వచ్చిన పని, తమకు నచ్చిన పనికి సంబంధించిన రంగాలలో యూనిట్లు స్థాపించుకొని లక్షాధికారి నుండి కోటీశ్వరులుగా ఎదగాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు.

 

ప్రచురణార్ధం

మే 11 ఖమ్మం:

. దళితబంధు లబ్దిదారులు తమకు వచ్చిన పని, తమకు నచ్చిన పనికి సంబంధించిన రంగాలలో యూనిట్లు స్థాపించుకొని లక్షాధికారి నుండి కోటీశ్వరులుగా ఎదగాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండలం కొత్తకారాయిగూడెంలో దళితబంధు యూనిట్లు గ్రౌండింగ్ అయిన లబ్దిదారులతో బుధవారం వారిరువురు ముఖాముఖి భేటి అయి యూనిట్ల స్థాపన, నిర్వహణ పట్ల అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ మాట్లాడుతూ దళితబంధు మంజూరు పట్ల కొన్నిరోజుల క్రితం అపోహలుండేవని, కాని ప్రస్తుతం లబ్ధిదారుల ఖాతాకు పైకం జమచేయడంతో పాటు యూనిట్లు గ్రౌండింగ్ చేయడం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం ఖమ్మం జిల్లాకు దళితబంధు కింద 5 వందల కోట్లను ఇప్పటికే కేటాయించిందని కలెక్టర్ తెలిపారు. లబ్ధిదారులకు మంజూరైన 10 లక్షలతో ఒకే యూనిట్ లేదా రెండు మూడు యూనిట్లు, అదేవిధంగా ఇద్దరు లేదా ముగ్గురు కలిసి లాభసాటి యూనిట్లను స్థాపించుకోవచ్చని దీనిలో ఎటువంటి నిబంధనలు కాని ఆంక్షలు లేవని పూర్తి స్వేచ్ఛ లబ్ధిదారునికే కల్పించబడిందని జీవితంలో లభించిన గొప్ప అవకాశాన్ని సద్వినియోగపర్చుకొని తమకు ఆసక్తి, నైపుణ్యం, అనుభవం కలిగిన రంగాలలో తరతరాలుగా ఉపయోగపడే విధంగా యూనిట్లను స్థాపించుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలని కలెక్టర్ అన్నారు. లబ్దిదారులందరూ ఒకే రకమయిన యూనిట్ల వైపు మొగ్గు చూపకుండ విభిన్న రంగాలలో ఆర్థికాభివృద్ధి సాధించే అవకాశాలు కలిగిన యూనిట్లను. స్థాపించుకోవాలని కలెక్టర్ సూచించారు. ఖమ్మం జిల్లాలో పాడి పరిశ్రమకు అత్యంత డిమండ్ ఉందని, మన జిల్లాలో రోజుకు 8 లక్షల లీటర్ల పాల వినియోగం అవసరం ఉండగా కేవలం రెండున్నర లక్షల లీటర్లు మాత్రమే మన జిల్లా రైతుల నుండి రావడం జరుగుతుందని దీన్ని దృష్టిలో ఉంచుకొని లబ్ధిదారులు పాడి పరిశ్రమవైపు కూడా మొగ్గు చూపాలని కలెక్టర్ తెలిపారు. సెంట్రింగ్ యూనిట్స్, ఎలక్ట్రికల్ షాప్స్, మోబైల్ టిఫిన్ సెంటర్స్, జె.సి.బిలు, హార్వేస్టర్ల వంటి డిమాండ్ కలిగిన యూనిట్లను స్థాపించుకోవాలని, ఇప్పటికి కూడా తాము దరఖాస్తు చేసుకున్న యూనిట్లకు బదులుగా డిమాండ్, తమకు ఆసక్తి కలిగిన యూనిట్లను మార్చుకునే అవకాశం ఉందని ఆలోచన చేసి ఆ దిశగా లబ్దిదారులు ముందుకెళ్ళాలని కలెక్టర్ సూచించారు. గ్రామంలో ఇప్పటికే 75 మంది లబ్ధిదారులకు వివిధ యూనిట్లను అందించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.

సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలిచే విధంగా లబ్ధిదారులు తమకు లభించిన అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలని ఆయన అన్నారు. దళితబంధు ద్వారా స్థాపించుకునే యూనిట్లు జీవనోపాధికి ఉపయోగపడే విధంగా ఉండాలని, ఆర్థిక అసమానతలను మార్చుకోవడం ద్వారా ఆర్ధికంగా ఎదిగి సమాజానికి ఆదర్శంగా నిలిచేందుకే రాష్ట్ర ప్రభుత్వం దళితబంధుకు శ్రీకారం చుట్టిందని ఆయన అన్నారు. నియోజకవర్గంలోని కొత్తకారాయిగూడెం గ్రామాన్ని దళితబంధుకు ఎంపిక చేశామని ప్రభుత్వ స్పూర్తి, ఉద్దేశ్యాన్ని లబ్ధిదారులు అర్ధం చేసుకొని అవకాశాన్ని సర్వినియోగపర్చుకోవాలన్నారు. కళ్యాణ లక్ష్మి పథకం కూడా ఎస్సీ, ఎస్టీలతోనే ప్రారంభమై ప్రస్తుతం బి.సి, మైనారిటీ, అగ్రవర్ణాల వారికి కూడా అందుతుందని, భవిష్యత్తులో దళితబంధు కూడా అన్ని వర్గాల వారికి లభించబోతుందని ఆయన తెలిపారు. ప్రభుత్వం ఇస్తున్న చేయూతతో ఆర్ధికాభివృద్ధి సాధించి మరో పది మందికి ఉపాధి కల్పించే దిశగా దళితబంధు లబ్దిదారులు ఎదగాలని సత్తుపల్లి నియోజకవర్గానికే కొత్త కారాయిగూడెంను ఆదర్శంగా నిలపాలని ఆయన అన్నారు.

అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, కల్లూరు రెవెన్యూ డివిజనల్ అధికారి సి. హెచ్. సూర్యనారాయణ, గ్రామ సర్పంచ్ డి శ్రీదేవి, ఎం.పి.పి. అలేఖ్య, ఎం.పి.టి.సి కృష్ణారావు, జడ్పీ.టి.సి మోహన్రావు, తహశీల్దారు రమాదేవి, ఎం.పి.డి.ఓ. కె. మహాలక్ష్మీ, స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post