దళితబంధు లబ్దిదారులు వాహనాలు తీసుకోవాలనుకుంటున్న వారు తమ యూనిట్లను ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని తమకు నచ్చిన మోడల్ ఎంచుకోవాలని అదనపు కలెక్టర్ పద్మజా రాణి సూచించారు. దళితబందు ద్వారా ట్రాన్స్పోర్ట్ యూనిట్లకు దరఖాస్తు చేసుకున్న లబ్దిదారులను బుధవారం కలెక్టరేట్ ఆవరణలో పిలిపించి వివిధ రకాలైన ట్రాన్స్పోర్ట్ వాహనాలు, ట్రాక్టర్లు, త్రిచక్ర వాహనాలను ప్రదర్శించారు. ఆయా కంపెనీలకు చెందిన ట్రాక్టర్ డీలర్లు, మోటార్ కార్, ఆటో రిక్షాల డీలర్లు తమ ఉత్పత్తులను ప్రదర్శనకు పెట్టి వాటి విశిష్టతలు తెలియజేస్తూ లబ్దిదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేసారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాట్లాడుతూ వివిధ రకాలైన వాహనాలు తీసుకోవాలనుకుంటున్న లబ్దిదారులకు అవగాహన నిమిత్తం ఈ రోజు కలెక్టరేట్ ప్రాంగణంలో అన్ని రకాలైన ట్రాన్స్పోర్ట్ వాహనాల డీలర్లను, వివిధ రకాల మోడళ్లను తెప్పించి లబ్దిదారులకు అవగాహన కల్పించడమే కాకుండా వారికి నచ్చిన మోడళ్లను ఎంచుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. లబ్దిదారులు వాటిని పరిశీలించి అనుభవజ్ఞులతో మాట్లాడి యూనిట్లను ఎంచుకోవాలని తెలియజేసారు.
ఈ ప్రదర్శనకు జాన్ డీర్, సోనాలిక, ఎస్, మహీంద్రా, ఫోర్స్, హోండా అమెజ్ తదితర కంపెని డీలర్లు తమ ఉత్పత్తులను వాటి విశిష్టతను లబ్దిదారులకు తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో ఈ.డి. ఎస్సి కార్పొరేషన్ హరినాథ్ రెడ్డి, జడ్పి డిప్యుటీ సి.ఈ .ఓ జ్యోతి, అయ్యా కంపెనీల డీలర్లు, దళిత బంధు లబ్దిదారులు పాల్గొన్నారు.