*దళితబంధు లబ్ధిదారులకు దీర్ఘకాలికంగా జీవనోపాధి అందించే యూనిట్లను గుర్తించాలి :: ఇంచార్జ్ జిల్లా రెవిన్యూ అధికారి టి. శ్రీనివాస రావు*

*దళితబంధు లబ్ధిదారులకు దీర్ఘకాలికంగా జీవనోపాధి అందించే యూనిట్లను గుర్తించాలి :: ఇంచార్జ్ జిల్లా రెవిన్యూ అధికారి టి. శ్రీనివాస రావు*

*ప్రచురణార్థం-1

రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 22: దళితబంధు పథకంలో భాగంగా ఆయా లబ్ధిదారులకు దీర్ఘకాలికంగా జీవనోపాధిని అందించే పలు యూనిట్లను గుర్తించాలని ఇంచార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి టి. శ్రీనివాస రావు అన్నారు. బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని చాంబర్ లో సంబంధిత ప్రభుత్వ శాఖల జిల్లా స్థాయి అధికారులతో కలిసి జిల్లా రెవిన్యూ అధికారి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యవసాయ, ఉద్యానవన, మత్స్య, పరిశ్రమలు, పౌర సరఫరాల శాఖలు, వివిధ ప్రభుత్వ శాఖల పరిధిలోకి వచ్చే వివిధ రకాల యూనిట్లను గుర్తించి లబ్ధిదారులకు తెలిపే విధంగా చూడాలని అన్నారు. ఈ పథకంలో భాగంగా ఒక్కో లబ్దిదారు కుటుంబానికి 10 లక్షల రూపాయలు అందజేయడం జరుగుతుందని అన్నారు. నిర్దిష్టమైన జీవనోపాధిని అందించి దళితుల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి తోడ్పాటును అందించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యమని ఆయన అన్నారు. అధికారులు అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు.
ఈ సమీక్షలో ఎస్సీ కార్పోరేషన్ ఈడీ ఎ. వినోద్ కుమార్, డీఏఓ రణధీర్ కుమార్, డీపీఓ ఎ.రవీందర్, డీఆర్డీఓ కె. కౌటిల్య, ఉద్యానవన శాఖ అధికారిణి జ్యోతి, పౌర సరఫరాల అధికారి జితేందర్ రెడ్డి, వేములవాడ మున్సిపల్ కమీషనర్ శ్యామ్ సుందర్ రావు తదితరులు పాల్గొన్నారు.

Share This Post