దళితవాడలు, గిరిజన కాలనీల సౌకర్యాలపై సమావేశం : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన
Dt:6. 08 2021
వనపర్తి

వనపర్తి జిల్లా పరిధిలోని దళితవాడలో కల్పనపై నివేదిక సమర్పించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని దళితవాడలు గిరిజన కాలనీలో సిసి రోడ్లు డ్రైనేజీలు ఇతర సౌకర్యాలపై సర్వే నిర్వహించి పది రోజుల లోపు నివేదిక అందజేయాలని ఆదేశించారు. గ్రామ పంచాయతీ మున్సి పాలిటీ పరిధిలోని దళితవాడలో ఎన్ని మిషన్ భగీరథ నల్ల కనెక్షన్ లు ఉన్నాయి ఇంకా ఎక్కడ ఏర్పాటు చేయాలి పూర్తి వివరాలు పంపాలన్నారు. ఎక్కడెక్కడ వీధిలైట్లు అవసరం ఉన్నది విద్యుత్ స్తంభాలు ఏర్పాటు తదితర వివరాలు సేకరించాలని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు దళితుల గిరిజనుల కాలనీలలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారని ఇందులో భాగంగా వనపర్తి జిల్లాలోని అన్ని దళితవాడలో గిరిజన కాలనీలలో అన్ని వసతులు ఏర్పాటు చేసేలా తనకు నివేదికలు పంపితే వాటిని సత్వరం నిధులు విడుదల అవుతాయని కలెక్టర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అంకిత్, ఆర్డీవో అమరేందర్, డిఆర్డిఓ నరసింహులు, సీఈవో వెంకట్ రెడ్డి,,డిపిఓ సురేష్ తదితరులు పాల్గొన్నారు.

…..

జిల్లా పౌరసంబంధాల అధికారి వనపర్తి జారీ చేయడమైనది.

Share This Post