దళితులను ధనవంతులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి మల్లారెడ్డి ,

పత్రిక ప్రకటన

తేదీ : 09–05–2022

డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కలలను సాకారం చేస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం,,

రాష్ట్ర ప్రభుత్వం దళితులకు అన్ని రంగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తోంది,,

దళితబంధు పథకం కింద 95 మందికి వాహనాలు అందచేత,,

దళితబంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలిచింది ,,

దళితులను ధనవంతులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం,,

రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి మల్లారెడ్డి ,

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకం కింద చేయూతనిస్తూ వారిని అన్ని రంగాల్లో ఎదిగేలా ప్రోత్సహిస్తోందని ఈ విషయంలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కలలను సాకారం చేసే దిశలో పయనిస్తోందని  రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.

సోమవారం మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలోని కీసర మండలం  చీర్యాల గ్రామ సమీపంలోని జయమోహన్ గార్డెన్స్లో దళితబంధు పథకం కింద అర్హులైన 95 మందికి ట్రాక్టర్లు, గూడ్స్, ఆటోలు ఇతర వాహనాలను కుత్భుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డితో కలిసి అందచేశారు. ఈ మేరకు మొదటగా దళితబంధు పథకం కింద ట్రాక్టర్ తాళాలను కీసర మండలం అంకిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బాలయ్యకు అందచేశారు. ఈ సందర్భంగా జిల్లా షెడ్యూల్  కులాల అభివృద్ది శాఖ ఆధ్వర్యంలో  ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ దళితులతో పాటు ఎస్టీ, బీసీలు, మైనారిటీలు అభివృద్ధి చెందాలన్న కలలను నిజం చేస్తోందని పేర్కొన్నారు. ఈ మేరకు వారందరి అభ్యున్నతికి, ఆర్థికంగా ఎదిగేలా కృషి చేస్తోందని మంత్రి అన్నారు.  తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిన దళితబంధు దేశానికే కాకుండా ప్రపంచానికే మార్గదర్శమని దేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేపట్టని విధంగా దళితుల అభ్యున్నతికి తెలంగాణ రాష్ట్రంలో ఈ పథకాన్ని ప్రవేశపెట్టి నెంబర్వన్గా నిలిచిందని మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు.  నేడు దళితుల కుటుంబాల్లో వెలుగులు నిం డుతున్నాయన్నారు. దళితబంధు యూనిట్లను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని అన్నారు.  ఈ పథకం కింద అర్హులైన దళితులందరికీ రూ.10 లక్షలు నేరుగా వారి ఖాతాల్లో జమ అవుతాయని ఆ డబ్బులతో 40 రకాల వివిధ వ్యాపారాలు చేసుకునేందుకు మంచి అవకాశమని దీనిని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని మంత్రి ఆకాంక్షించారు.  దళితులను ధనవంతులను చేయడమే లక్ష్యంగా దళితబంధు పథకాన్ని ఏమాత్రం దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలని కోరారు. దళితులంటే గతంలో పాలకులు చిన్నచూపు చూసేవారని కానీ ప్రస్తుతం తమ ప్రభుత్వ హయాంలో వారికి ఎంతో ప్రాధాన్యతనిస్తూ వారందరినీ ధనవంతులుగా, రాజులుగా చేయడానికి కృషి చేస్తున్నామని మంత్రి మల్లారెడ్డి వివరించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత దళితబంధు పథకం కింద రూ.17 వేల 700 కోట్లను బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగిందని ఈ మేరకు రెండో విడత అర్హులైన వారికి కూడా దళితబంధు కింద లబ్ధి చేకూరుస్తామని మంత్రి పేర్కొన్నారు. గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలైన  పేద విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యికి పైగా నిర్వహిస్తున్నామని వారికి నాణ్యమైన విద్యనందించడంతో పాటు అన్ని రకాల సదుపాయాలు సమకూరుస్తూ సొంత ఇంటిని మరిచిపోయేలా ప్రభుత్వం చేస్తోందని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. విద్య విషయంలో సీఎం కేసీఆర్ అన్ని రకాల వసతులు సమకూర్చారని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు. దీంతో పాటు రాష్ట్ర  వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా విద్యనందించేందుకు మన ఊరు – మన బడి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి అందుకుగాను రూ.7,331 కోట్లు రాష్ట్రానికి మంజూరు చేసిందని తెలిపారు. దీని ద్వారా ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు సమకూర్చుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిన దళితబంధు పథకంతోపాటు ప్రభుత్వం చేపట్టిన రైతుబంధు, రైతుబీమా వంటి అనేక పథకాలు దేశానికే కాకుండా ప్రపంచానికే మార్గదర్శమని దేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేపట్టని విధంగా దళితుల అభ్యున్నతికి తెలంగాణ రాష్ట్రంలో ఈ పథకాన్ని ప్రవేశపెట్టి నెంబర్వన్గా నిలిచిందని మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు.  దళితుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో రిజర్వేషన్లు కల్పించి  వారిని ఆర్థికంగా ఎదిగేలా సౌకర్యాలు కల్పిస్తోందని దీనిని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు.

కుత్భుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధు ఎంతో గొప్ప కార్యక్రమమని అన్నారు. ఈ దళితబంధు ద్వారా అట్టడుగు స్థాయిలో, ఆర్థికంగా ఎదుగుదల లేని వారిని అభివృద్ధిపథంలో పయనించేందుకు రూపొందించిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ దళితుల కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టడంతో పాటు ఆ కార్యక్రమాలు, పథకాలను సైతం దళిత వాడల నుంచే మొదలుపెడుతున్నారని దీనిని బట్టి సీఎం కేసీఆర్కు దళితుల పట్ల ఉన్న ప్రేమను, వారి అభివృద్ధి ఆకాంక్షను తెలియజేస్తోందని ఎమ్మెల్యే వివేకానంద్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా దళితబంధు పథకం ఎంతో విశిష్టతను సంతరించుకొందని పేదరిక వ్యవస్థను నిర్మూలించి దళితులను ఉన్నత స్థితిలో నిలిపేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని వివేకానంద్ స్పష్టం చేశారు. ఈ పథకాన్ని దుర్వినియోగం కాకుండా కష్టపడి సద్వినియోగం చేసుకోవాలని అప్పుడే ఆర్థికంగా రాణిస్తారని తెలిపారు.

ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి మాట్లాడుతూ దళితులకు అనేక పథకాలు ప్రవేశపెట్టి వారిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి కృతనిశ్చయంతో పని చేస్తున్నారని అన్నారు.  ప్రభుత్వం దళితులకు అందిస్తోన్న దళితబంధు పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా రాణించాలని మరింత అభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే సుభాష్రెడ్డి ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితులు, బడుగు, బలహీనవర్గాల సంక్షేమం కోసం ఎంతగానో కృషి చేస్తోందని ఈ విషయంలో సీఎం కేసీఆర్ వారిని ఆర్థికంగా అభివృద్ధిపథంలో తీసుకెళ్ళేందుకు అనేక రకాల పథకాలు ప్రవేశపెట్టడంతో పాటు రాయితీలు అందించి వారిపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్  నర్సింహారెడ్డి,  జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాలాజీ, ఫీర్జాదీగూడ మేయర్ వెంకట్రెడ్డి,, ఆర్డీవోలు రవి, మల్లయ్య, నిజాంపేట్ మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డి, బొడుప్పల్ మేయర్ బుచ్చిరెడ్డి, ఫీర్జాది గూడ మేయర్ వెంకట్ రెడ్డి, జడ్పీవైస్ చైర్మన్ వెంకటేష్ మరియు ఎంపిపిలు, జడ్పీటీసీలు, సర్పంచ్ లు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మేయర్లు, మున్సిపల్ ఛైర్పర్సన్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా శాఖ అధికారులు, ఆయా కుల సంఘాల నాయకులు,  సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post