దళితుల అభ్యున్నతికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని జిల్లా కలెక్టర్ హనుమంతరావు పేర్కొన్నారు.

దళితుల అభ్యున్నతికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని జిల్లా కలెక్టర్ హనుమంతరావు పేర్కొన్నారు.

శుక్రవారం కలెక్టర్ తన చాంబర్లో ఎస్సీ లబ్ధిదారునికి స్టాండ్ అప్ ఇండియా పథకం కింద మంజూరైన కాంక్రీట్ మిక్సర్ వాహనం తాళంచెవిని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీల ఆర్థికాభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. వివిధ పథకాల క్రింద ప్రభుత్వం అందిస్తున్న సాయాన్ని లబ్ధిదారులు సక్రమంగా వినియోగించుకుని ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలని సూచించారు. అదేవిధంగా పొందిన రుణాన్ని తిరిగి సక్రమంగా సకాలంలో చెల్లించాలని లబ్ధిదారునికి సూచించారు.

ప్రభుత్వ ఆర్థిక మద్దతు పథకాలలో వేగవంతంగా రుణాలు అందిస్తున్న బ్యాంకర్లను ఈ సందర్భంగా కలెక్టర్ అభినందించారు.

స్టాండ్ అప్ ఇండియా పథకం క్రింద సంగారెడ్డి మండలం ,రాజంపేటకు చెందిన ఉదయ్ అరుణ్ కు రూ.57 లక్షల విలువగల కాంక్రీట్ మిక్సర్ యూనిట్ మంజూరైయిందన్నారు. అందులో లబ్ధిదారుని వాటా ఎనిమిది లక్షలు కాగా, రూ.49 లక్షలు బ్యాంకు ద్వార రుణం మంజూరైందని తెలిపారు. యూనిట్ విలువ మొత్తంలో 35 శాతం లబ్ధిదారునికి సబ్సిడీ లభిస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో ఎల్ డి ఎం రమణారెడ్డి, ఎస్.బి. ఐ. బ్యాంక్ మేనేజర్, సంబంధిత బ్యాంకు సిబ్బంది, లబ్ధిదారుడు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post