సోమవారం నాడు కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో దళిత బంధు పై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరిష్ రావు, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర బి.సి. సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ నిర్వహించిన సమీక్షా సమావేశానికి జిల్లా కలేక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు హాజరయ్యారు.
అనంతరం కలేక్టర్ మాట్లాడుతూ హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు పథకం క్రింద జిల్లాలోని కమలాపూర్ మండలంలోని శనిగరం గ్రామానికి చెందిన నాంపల్లి రాజేందర్ అనే పేద దళిత కూలి హర్యానాకు వెళ్లినట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ గత ఆగష్టు 16వ తేది న హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు పథకం ప్రారంభించిన సందర్భంగా 15 మందినీ ఎంపిక చేసిన తోలి జాబితాలో ఈ పేద కూలి ఉన్నారని తెలిపారు. అతని ఎకౌంటు లో పది లక్షల రూపాయలను జమచేసినట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఈ దళిత కూలి కోరిక మేరకు హర్యాన రాష్ట్రంలోనీ నాలుగు ముర్రా జాతి పశువులను కొనుగోలు చేయడానికి హర్యానా రాష్ట్రానికి అధికారులతో కలసి వెళ్ళారనీ, వీరితో పాటు కరీంనగర్ జిల్లాకు చెందిన మరో ముగ్గురు లబ్దిదారులు కూడా వెళ్ళారని అయన తెలిపారు. పశువుల షెడ్లు నిర్మించుకొనుటకు లక్ష రూపాయల చొప్పున మంజూరు చేశామని తెలిపారు. మండల పంచాయితీ అధికారులు లబ్ధిదారులను తీసుకొని హర్యానా రాష్ట్రంలోని రోహతక్ జిల్లా, దనాన, బీహల్ గ్రామాలలో పాడి గేదెలను పరిశీలించిన అనంతరం బోహర్ గ్రామంలో లబ్ధిదారులు తమకు నచ్చిన పాడి గేదెలను కొనుగోలు చేశారని కలెక్టర్ తెలిపారు. రెండు, మూడు రోజుల్లో వారు హర్యాన నుండి పాడి పశువులతో జిల్లాకు రానున్నట్లు కలెక్టర్ వివరించారు. దళిత బంధు పథకం క్రింద కమలాపూర్ మండలంలో 3788 మంది లబ్దిదారులను అర్హతల మేరకు వారిని గుర్తించి వారి ఆన్లైన్ ఖాతా లో ఒక్కోరికి పది లక్షల రూపాయల చొప్పున జమచేసినట్లు అయన తెలిపారు