దళితుల కండ్లలలో ఆనందం, జీవితాల్లో వెలుగులు నింపేందుకే దళిత బంధు పథకం :: గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్.

ప్రెస్ రిలీజ్…3.
తేది.4.6.2022.
ములుగు జిల్లా.

దళితుల కండ్లలలో ఆనందం, జీవితాల్లో వెలుగులు నింపేందుకే దళిత బంధు పథకం :: గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్.
౦౦౦౦౦
రాష్ట్ర ముఖ్య మంత్రి దళిత బంధు పథకం పవేశ పట్టి దళితుల కండ్లలలో ఆనందం, జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.

శనివారం జిల్లా కేంద్రంలోని డిగ్రి కళాశాల మైదానంలో ఎస్సి కార్పొరేషన్ అద్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లాలోని దళితబంధు యూనిట్ల పంపిణి కార్యక్రమములో మహబూబాబాద్ పార్లమెంటు సభ్యురాలు మాలోత్ కవిత, జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్, ములుగు, భద్రాచలం శాసనసభ సభ్యులు ధనసరి అనసూయ, పోడెం వీరయ్య, రాష్ట్ర ఎస్సి కార్పొరేషన్ చేర్మెన్ బండ శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ యస్. క్రిష్ణ ఆదిత్య లతో కలసి గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ 65 ట్రాక్టర్లు,32 కార్ టాక్సీ యూనిట్లను లబ్దిదారులకు పంపిణి చేసారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దళితుల కండ్లలలో ఆనందం వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకే దళిత బంధు అమలు చేస్తోందన్నారు. ఒక్క రూపాయి కూడా పెట్టుబడి అవసరం లేకుండా ప్రభుత్వమే పది లక్షల రూపాయలను బ్యాంకులో జమ చేస్తుందన్నారు. ఈ డబ్బుతో దళితులు తమకు నచ్చిన యూనిట్లను స్థాపించుకుని ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న యూనిట్ల స్థాపించి దళితులు ఆర్థికంగా ఎదగాలని మంత్రి సూచించారు. దళిత బంధు దళిత కుటుంబాల అందరికీ అందిస్తామన్నారు. దళిత బంధు లబ్ధిదారులు తమకు అందిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ కష్టపడి పనిచేయాలని, 2 సంవత్సరాల కాలంలో 3 రెట్లు అధికంగా సంపాదించి ఆర్థికంగా
స్థిరపడాలని మంత్రి సూచించారు. ఆర్థికంగా ఎదిగిన పక్షంలో సమాజంలో వివక్ష వెనుకబాటుతనం నుంచి విడుదల లభిస్తుందని ఆమె తెలిపారు.

పార్లమెంటు సభ్యురాలు మాలోత్ కవిత మాట్లాడుతూ ప్రతి లబ్ధిదారులు ట్రాక్టర్లు, వాహనాలను మాత్రమే కొనుగోలు చేస్తే వ్యాపార అవకాశాలు చాలా దెబ్బతింటాయని, మన ఎదుగుదల పై ప్రభావం చూపుతుందని దీని పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆమె అన్నారు. దళిత బంధు పథకం దేశానికే దిక్సూచిగా నిలుస్తుందని అన్నారు. దళితులు ఆర్థికంగా ఎదగాలని ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా దళిత పథకం రూపొందించారని, ప్రతి దళిత కుటుంబానికి ఎలాంటి బ్యాంక్ లింకేజీ లేకుండా వ్యాపారాల నిమిత్తం రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుందని ఆమె అన్నారు.

జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ మాట్లాడుతూ దళిత బంధు పథకం దేశానికే దిక్సూచి, ప్రభుత్వం అందిస్తున్న దళిత బంధు పథకాన్ని లబ్ధిదారులు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోని , ఆర్థిక స్థిరత్వం సాధించాలని లబ్ధిదారులకు సూచించారు. దళిత బంధు పథకం దేశంలో ఎక్కడ అమలు చేయడం లేదని కేవలం తెలంగాణా రాష్ట్రం ముఖ్యమంత్రి తోనే సాధ్యం అయ్యిందని ఆయన అన్నారు.

ములుగు శాసన సభ్యురాలు ధనసరి అనసూయ దళిత బంధు పథకం పైలెట్ ప్రాజెక్టు కింద ప్రతి నియోజకవర్గ పరిధిలో 100 మంది లబ్ధిదారులను స్థానిక ఎమ్మెల్యేలు ఎంపిక చేసి, వారికి పథకాన్ని అమలు చేయడం జరుగుతుందని ఆమె అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి దళితుల అభ్యున్నతికి ప్రవేశపెట్టిన దళితబందు పథకాన్ని లబ్దిదారులు సద్వినియోగం చేసుకొని సమాజంలో ఇతరులతో సమానంగా మెరుగైన జీవనం గడపాలని అన్నారు.

భద్రాచలం శాసన సభ్యులు పోడెం వీరయ్య మాట్లాడుతూ నా నియోజకవర్గంలోని లబ్ధిదారులకు యూనిట్లను పంపిణీ చేసినందుకు హర్షం వ్యక్తం చేసారు. ఈ పథకం ద్వారా లబ్ది పొందిన లబ్దిదారులు ఆర్ధికంగా ఎదగాలని ఆయన కోరారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దళిత బంధు పథకం పైలెట్ ప్రాజెక్టు కింద జిల్లాలో మొత్తం 119 మంది లబ్ధిదారులను ఎంపిక చేశామని, 97మంది లబ్ధిదారులకు యూనిట్లను పంపిణీ చేస్తున్నామని, మిగిలిన 22 మంది లబ్దిదారులు ఎంచుకున్నా యూనిట్లను పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రతి దళిత బంధు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో రూ.9.9 లక్షల నిధులు జమ చేస్తామని, మిగిలిన రూ.10వేలకు ప్రభుత్వం మరో 10వేలు జమ చేసి దళిత రక్షణ నిధి ఏర్పాటు చేస్తుందని కలెక్టర్ అన్నారు దళిత బంధు లబ్ధిదారులు భవిష్యత్తులో మరోసారి పేదరికంలోకి వెళ్లకుండా ఆపద సమయంలో దళిత రక్షణ నిధి ఉపయోగపడుతుందని కలెక్టర్ అన్నారు.

అంతకు ముందు జిల్లా కేంద్రంలో రూ. కోటి 73 లక్షల తో నిర్మించిన ప్రభుత్వ అతిథి గృహని ప్రారంభించారు.
అలాగే రూ. 2 కోట్ల 60 లక్షలతో మెడికల్ కళాశాల స్థలానికి ప్రహరి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు.

అనంతరం కలెక్టరేట్ ప్రాంగణం లో రూ. 48 లక్షలతో నిర్మించిన ప్రభుత్వ కార్యాలయాలు జిల్లా పౌర సంబందాల అధికారి, జిల్లా సహకార అధికారి, జిల్లా వ్యవసాయ అధికారి, జిల్లా పౌర సరఫరాల అధికారి, సమీకృత భవనాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవిన్యూ)వైవి గణేష్, ఆర్డిఓ కే. రమాదేవి, రైతు సమన్వయ సమితి సభ్యులు పళ్ళ బుచ్చయ్య, జడ్పిటిసిలు సభ్యులు రుద్రమదేవి, పాయం రమణ, పుష్పలత, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తుల రవి, జడ్పీ సీఈవో రమాదేవి, సంబంధిత అధికారులు, దళిత బంధు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post