దళితుల జీవితాల్లో వెలుగులు నింపాలని గౌరవ ముఖ్యమంత్రి అందించిన దళిత బంధు పథకంతో లబ్ది పొంది, ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి శ్రీమతి స్మిత సబర్వాల్ అన్నారు.

బుధవారం నాడు తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో ఆమె రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీమతి దివ్య, రాష్ట్ర షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ సెక్రటరీ రాహుల్ బొజ్జా,  ముఖ్యమంత్రి కార్యాలయ ఓఎస్డి శ్రీమతి ప్రియాంక వర్గీస్, రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ డాక్టర్ ఎ.శరత్, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారి లతో  కలిసి దళిత బంధు లబ్ధిదారులను కలుసుకొన్నారు. బొల్లారం రాములు గొర్రెల యూనిట్,  బొల్లారం లావణ్య గేదెలు, వత్తుల మిషన్ యూనిట్లు,  గ్యార అండాళు డోజర్ వాహనం,  చిన్నూరు మానస ఆటో క్యారియర్  పరిశీలించి, దళిత బంధు పథకాన్ని వారు  సద్వినియోగం చేసుకుంటున్న తీరును అడిగి తెలుసుకున్నారు. తమ జీవితాలలో వెలుగులు నింపాలని ముఖ్యమంత్రి దళిత బంధు ప్రవేశపెట్టారని,  వారు చూపిన బాటలో మనోధైర్యంతో ముందుకు సాగుతామని, ముందు ముందు కొంత మందికి ఉపాధి కల్పిస్తామని లబ్ధిదారులు సంతోషంతో తెలిపారు.
మీకు ఎలాంటి సమస్యలు రాకుండా, యూనిట్ల గ్రౌండింగ్ లో  ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకుంటారని ఆమె లబ్ధిదారులతో అన్నారు.
కార్యక్రమంలో జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్యామ్,  జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఉపేందర్ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి శ్రీమతి సునంద, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ భిక్యూ నాయక్,  భువనగిరి రెవెన్యూ డివిజనల్ అధికారి భూపాల్ రెడ్డి, ఎంపీపీ శ్రీమతి భూక్యా సుశీల, గ్రామ సర్పంచ్ పోగుల ఆంజనేయులు, ఎంపీటీసీ పలుగుల ప్రవీణ్ కుమార్,  గ్రామ వార్డు సభ్యులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

దళితుల జీవితాల్లో వెలుగులు నింపాలని గౌరవ ముఖ్యమంత్రి అందించిన దళిత బంధు పథకంతో లబ్ది పొంది, ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి శ్రీమతి స్మిత సబర్వాల్ అన్నారు.

Share This Post