దళితుల సాధికారత, స్వావలంబన కోసం దళిత బంధు: రాష్ట్ర ఐ. టి. శాఖ మంత్రి కే. తారకరామారావు

 

*దళితుల సాధికారత,స్వావలంబన కోసం* *దళిత బంధు*

*దళిత బంధు పథకం తో…*
*దళితుల దిశ,దశ మారాలి*

-దళితబంధు పథకం అమలు చేయడం చరిత్రాత్మక నిర్ణయం

– సీఎం నమ్మకాన్ని వమ్ము చేయొద్దు

– కూలీల నుంచి యాజమానుల గా, వ్యాపార వేత్తలు గా ఎదగాలి

– రాష్ట్ర మంత్రి శ్రీ కే తారక రామారావు

——————————

శతాబ్దాలుగా సామాజిక వివక్షకు, అణచివేతకు గురవుతోన్న దళితు సాధికారత, స్వావలంబన సాధించేందు కోసం దళిత బంధు పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందనీ రాష్ట్ర ఐటి పురపాలక,పట్టణాభిృద్ధిశాఖ మంత్రి శ్రీ
కే టి రామారావు పేర్కొన్నారు.

 

బుధవారం ఎల్లారెడ్డిపేట మండలం, పదిరకు చెందిన దళిత బంధు లబ్ధిదారులు ముగ్గురు అక్కపల్లి శివారులో నిర్మించుకోనున్న నాలుగు టన్నుల సామర్థ్యం గల
రా రైస్ మిల్లు నిర్మాణానికి మంత్రి శ్రీ కేటీఆర్ భూమి పూజ చేశారు.

 

వందలు, వేల గంటల మేధోమథనం, మేధావులతో సుదీర్ఘ సంప్రదింపుల అనంతరం
దళిత కుటుంబాల ఆర్థిక అభ్యున్నతిని కాంక్షిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దళితబంధు పథకం కు శ్రీకారం చుట్టారనీ మంత్రి పేర్కొన్నారు. రాజకీయ లబ్ధి కోసమో ఓట్ల కోసమో ప్రవేశపెట్టలేదన్నారు.
సిఎం కేసిఆర్ పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా… దళిత బంధు పథకం ను సద్వినియోగం చేసుకుంటూ….
కూలీల నుంచి ఓనర్లు గా, సక్సెస్ పుల్ వ్యాపార వేత్తలు గా ఎదగాలనీ మంత్రి సూచించారు.

అరవై ఏళ్లుగా దళితుల కోసం అనేక పథకాలు అమలైనప్పటికీ సమాజంలో అత్యధిక మంది దళితులు అట్టడుగునే ఉన్నారని మంత్రి అన్నారు. ఎలాంటి బ్యాంకు గ్యారెంటీలు లేకుండానే నేరుగా లబ్ధిదారులకు రూ.10 లక్షలు ఆర్థిక సహాయాన్ని అందజేసే పథకం దేశంలోనే మరెక్కడా లేదని తెలిపారు. లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న యూనిట్ లకు సంబంధించి
వ్యాపార నిర్వహణ ను సొంతంగా చూసుకోవాలని అన్నారు .
దళిత బంధు పథకం తో దళితులు కూలీల నుంచి ఓనర్లు గా, సక్సెస్ పుల్ వ్యాపార వేత్తలు గా ఎద గాలని అన్నారు.

అనంతరం మంత్రి
సిరిసిల్ల పట్టణంలోని సెస్ కార్యాలయంలో సెస్ నూతన పాలకవర్గం పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమo కు హాజరయ్యారు. మంత్రి సమక్షంలో
సెస్ చైర్మెన్ శ్రీ గూడూరి ప్రవీణ్ , సభ్యులు పదవీ బాధ్యతల స్వీకరించగా మంత్రి శ్రీ కేటీఆర్, సాంస్కృతిక సారథి చైర్మెన్, మానకొండూర్ శాసనసభ్యులు శ్రీ రసమయి బాలకిషన్, జెడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి ఎన్.అరుణ , చొప్పదండి శాసనసభ్యులు శ్రీ సుంకె రవిశంకర్ లు నూతన పాలక వర్గ ఛైర్మన్, సభ్యులకు అభినందనలు తెలిపారు.

ఆ వెంటనే మంత్రి ఎల్లారెడ్డి పేట మండలం వెంకటాపూర్ గ్రామంలో ఎల్లమ్మ సిద్దోగానికి హాజరయ్యారు.

అనంతరం పదిరకు చెందిన 9 మంది దళితబంధు లబ్ధిదారులు దళితబంధు పథకంలో భాగంగా హరిదాసు నగర్ లో ఏర్పాటు చేయనున్న పెట్రోల్ పంపుకు మంత్రి భూమిపూజ చేశారు.

*ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేసిన మంత్రి*

సిరిసిల్ల నియోజకవర్గ పర్యటనకు వచ్చిన మంత్రి మొదట
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నిర్మించిన స్వాగత తోరణాన్ని మరియు కూడలిలో ఏర్పాటు చేసిన ఫౌంటెన్ ను ప్రారంభించారు.

ఆ వెంటనే ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గ్రామ పంచాయితీ నిధులు రూ.11 లక్షల తో నిర్మించిన 16 దుకాణ సముదాయాలను మంత్రి ప్రారంభించారు.

కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి ఎన్ అరుణ, జిల్లా కలెక్టర్ శ్రీ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్ శ్రీ బి సత్య ప్రసాద్, ఆర్డీఓ శ్రీ శ్రీనివాస్ రావు , జిల్లా విద్యాధికారి శ్రీ డి రాధా కిషన్, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

——————————

Share This Post