దళిత ఆత్మగౌరవ పతాక భాగ్యరెడ్డి వర్మ, ఘనంగా భాగ్యరెడ్డి వర్మ135జయంతి వేడుకలు, మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి ,

దళిత ఆత్మగౌరవ పతాక భాగ్యరెడ్డి వర్మ,
ఘనంగా భాగ్యరెడ్డి వర్మ135జయంతి వేడుకలు,
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి ,
తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో సోమవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో డా. భాగ్య రెడ్డి వర్మ 135 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిత్ర పటానికి అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి , ఇతర జిల్లా అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అంతకుముందు జ్యోతి ప్రజ్వలన చేసి జయంతి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి, మాట్లాడుతూ భాగ్య రెడ్డి వర్మ 1906-1933 మధ్య హైదరాబాదు సంస్థానంలో 26 దళిత బాలికల పాఠశాలలను స్థాపించి, వారి అభ్యున్నతికి గట్టి పునాదులు వేశారని ఆయన సేవలను కొనియాడారు. దళిత వైతాళికుడుగా ప్రసిద్ధి చెందిన భాగ్యరెడ్డి వర్మ అడుగుజాడల్లో నడవాలని, ఆయన ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు.దళితుల అభ్యున్నతికి దళిత మహిళల విద్యార్జన కోసం భాగ్యరెడ్డి వర్మ ఎనలేని కృషి చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. భాగ్యరెడ్డి వర్మ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిచడం ఆనందంగా ఉందన్నారు. మహనీయుల జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించుకోవడం ద్వారా వారిని గౌరవించుకోవడంతో పాటు మహనీయుల స్పూర్తితో సమాజ హితం కోసం ముందుకు సాగేందుకు ఈ వేడుకలు దోహదపడుతున్నాయని అభిప్రాయపడ్డారు
ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, లా ఆఫీసర్ చంద్రావతి , సీపీవో మోహన్ రావు , జిల్లా సాంఘిక సంక్షేమ అభివృద్ధి శాఖ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Share This Post