దళిత కాలనీల్లో మౌలిక సదుపాయాల వివరాలు సేకరణ:: జిల్లా కలెక్టర్ జి రవి

దళిత కాలనీల్లో మౌలిక సదుపాయాల వివరాలు సేకరణ:: జిల్లా కలెక్టర్ జి రవి

ప్రచురణార్థం—–2                                                                                                                                                                                         తేదీ.6.8.2021

దళిత కాలనీల్లో మౌలిక సదుపాయాల వివరాలు సేకరణ:: జిల్లా కలెక్టర్ జి రవి

జగిత్యాల, ఆగస్ట్ 6:- జిల్లాలోని దళితవాడలో మరియు దళిత కాలనీల్లోని ఉన్న మౌలిక సదుపాయాలు వివరాలను సర్వే చేసి సేకరించాలని జిల్లా కలెక్టర్ జి రవి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎస్సీ , ఎస్టీ కాలనీలో మౌలిక వసతులు ( రోడ్లు, నీటి కనెక్షన్లు ,పైప్ లైన్ లీకేజీలు, విద్యుత్ సరఫరా, లైన్లు,ఎల్.ఈడి విధి లైట్లు మొదలగునవి ) కల్పన పై సంబంధిత అధికారులతో కలెక్టర్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎస్సీ ఎస్టీ కాలనీలలో మౌలిక సదుపాయాల వివరాలను సంపూర్ణంగా నిర్ణిత నమూనా ఫారంలో సేకరించాలని అధికారులను ఆదేశించారు.  దళితుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు వారికి సకాలంలో అందేలా కృషి చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని కలెక్టర్ తెలిపారు. ముఖ్యంగా గ్రామాలలో మరియు పట్టణాల్లో అధికార బృందాలు గ్రామ ,మండల, వార్డుల వారీగా పర్యటించి, స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశాలు నిర్వహించుకొని దళిత కాలనీలో/వాడలలో సిసి రోడ్లు, డ్రైనేజీలు, త్రాగునీటి సౌకర్యం, త్రి ఫేస్ కరెంటు తదితర సౌకర్యాల గురించి నిర్ణిత నమూనా ఫారంలో సర్వే చేసి నివేదికలను సకాలంలో అందించాలని కలెక్టర్ తెలిపారు. తద్వారా ఆయా కాలనీలలో సంపూర్ణంగా మౌలిక వసతులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వానికి ఒక అవగాహన వస్తుందని అన్నారు.  గ్రామాల అభివృద్ధి కొరకు వివిధ గ్రాంటుల కింద మండలాలకు అందజేసిన నిధులు మరియు ఆ నిధులతో చేపట్టిన పనుల ప్రగతిని ప్రతి ఒక్క మండల ప్రత్యేక అధికారి ప్రత్యేకంగా సమీక్షించి ఆయా పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామాల్లో మొదలు పెట్టని పనుల వివరాలు, పూర్తయిన పనుల వివరాలు, పురోగతిలో ఉన్న పనుల వివరాల నివేదికలను అందించాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జెడ్పి.సి.ఈ. ఓ, సిపిఓ,డీపీఓ, మండల ప్రత్యేక అధికారులు,మున్సిపల్ కమిషనర్ లు,ఎం.పి.డి.ఓలు, పంచాయతీ రాజ్, ఆర్డబ్ల్యూఎస్, ఆర్ అండ్ బి, ఇరిగేషన్, మీషన్ భగీరథ, విద్యుత్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి జగిత్యాలచే జారీ చేయనైనది

దళిత కాలనీల్లో మౌలిక సదుపాయాల వివరాలు సేకరణ:: జిల్లా కలెక్టర్ జి రవి

దళిత కాలనీల్లో మౌలిక సదుపాయాల వివరాలు సేకరణ:: జిల్లా కలెక్టర్ జి రవి

Share This Post