దళిత, గిరిజన అవాసాల్లో మౌళిక సదుపాయాల కల్పనకు పటిష్ట కార్యాచరణ:: జిల్లా కలెక్టర్ కె. నిఖిల

దళిత, గిరిజన అవాసాల్లో మౌళిక సదుపాయాల కల్పనకు పటిష్ట కార్యాచరణ:: జిల్లా కలెక్టర్ కె. నిఖిల

జనగామ, ఆగస్టు 6: దళిత, గిరిజన అవాసాల్లో మౌళిక సదుపాయాల కల్పనకు పటిష్ట కార్యాచరణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ కె. నిఖిల అన్నారు. శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి మండల ప్రత్యేక అధికారులు, ఎంపిడివోలు, ఎంపీవోలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దళిత, గిరిజన ఆవాసాల సమగ్ర అభివృద్ధి, తెలంగాణ కు హరితహారం, సెగ్రిగేషన్ షెడ్లు, వైకుంఠదామాల పూర్తిపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, దళిత, గిరిజన ఆవాసాల సమగ్ర అభివృద్ధికి కార్యాచరణతో చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామానికి జిల్లా స్థాయి, మండల స్థాయి అధికారిని కేటాయించి, షెడ్యూల్ ప్రకారం వారు గ్రామాన్ని సందర్శించేలా చర్యలు చేపడతామన్నారు. దళిత, గిరిజన అవాసాల్లో మౌళిక సదుపాయాలకల్పనకు ఏ ఒక్క అంశంలో లోటు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మండల ప్రత్యేక అధికారులు, ఎంపిడివోలు, ఎంపీవోలకు కొన్ని గ్రామాల బాధ్యతలు అప్పగించి, వారికి వారి క్రింది స్థాయి సిబ్బందిని సహకారానికి కేటాయిస్తామన్నారు. ప్రతి గ్రామంలో పనులు, హరితహారం, పారిశుద్ధ్య, విద్యుత్ సంబంధ 4 కమిటీలు 15 మంది చొప్పున సభ్యులతో ఉన్నట్లు ఆమె అన్నారు. గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధులు, కమిటీల సభ్యులు, అధికారులతో కూడిన బృందం దళిత, గిరిజన అవాసాల్లో వీధి, ప్రతి ఇల్లు సందర్శించి సమస్యలు గుర్తించి, మౌళిక వసతులకు సంబంధించిన వాటికి ఖచ్చితమైన అంచనాలతో ప్రతిపాదనలు ఏ రోజుకారోజు నివేదిక ఇచ్చిన నమూనాలో పొందుపర్చి సంతకాలతో హార్డ్, సాఫ్ట్ కాపీలు సమర్పించాలన్నారు. గ్రామ సందర్శన అనంతరం దళిత, గిరిజన అవాసాల్లో అనువైన ప్రదేశంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ కమిటీల సభ్యులు, కాలనీవాసులతో సమావేశం నిర్వహించాలన్నారు. గ్రామ కమిటీల సభ్యులు సమావేశానికి ఖచ్చితంగా హాజరయ్యేలా చూడాలని, క్రియాశీలకంగా లేనివారి స్థానంలో వేరే వారిని నియమించుకోవాలని ఆమె అన్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి మైక్ సిస్టం అందుబాటులో ఉందని, ప్రతి సమావేశంలో దానిని ఉపయోగించాలని అన్నారు. టీమ్, షెడ్యూల్, నివేదిక నమూనా ఫారాలు ఇస్తామని, షెడ్యూల్ ప్రకారం గ్రామాల సందర్శన చేయాలని, ఉదయం 6 గంటల కల్లా గ్రామంలో ఉండాలని అన్నారు. పంచాయతీ కార్యదర్శి, విఆర్ఏలతో సమన్వయం చేసుకోవాలన్నారు. గ్రామంలో టాం టాం ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. హరితహారం క్రింద లక్ష్యాన్ని వారం రోజుల్లో పూర్తి చేయాలన్నారు. అవెన్యూ ప్లాంటేషన్ చాలా చక్కగా చేపట్టినట్లు ఆమె అన్నారు. పూర్తి చేసిన ప్లాంటేషన్ ఆన్లైన్ లో అప్డేట్ చేయాలన్నారు. బృహత్ పల్లె ప్రకృతి వనాలు ట్రెంచింగ్, ఫెన్సింగ్, పిట్టింగ్ పూర్తి చేసి, వారం రోజుల్లో ప్లాంటేషన్ పూర్తి చేయాలన్నారు. గ్రామాల్లో తడి, పొడి చెత్త సేకరణకు ప్రజల్లో అవగాహన కల్పించి, చైతన్యం తేవాలన్నారు. అన్ని సెగ్రిగేషన్ షెడ్లను పూర్తి స్థాయిలో వాడుకలోకి తేవాలన్నారు. ఇంకనూ పూర్తి కాని వైకుంఠదామాల పూర్తికి చర్యలు వేగవంతం చేయాలన్నారు. గ్రామాల సందర్శనలో వైకుంఠ దామాల్లో విద్యుత్, త్రాగునీటి సరఫరాను పరిశీలించి, లోటుపాట్లపై నివేదిక సమర్పించాలన్నారు. సమర్పించే ప్రతి నివేదిక వాస్తవాలతో కూడి, ఖచ్చితమైన సమాచారంతో ఉండాలని, ప్రతి నివేదికను జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో క్రాస్ చెక్ ఉంటుందని, అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని ఆమె అన్నారు. ప్రభుత్వ అత్యంత ప్రతిష్ఠాత్మక కార్యక్రమమని, అధికారులు వ్యక్తిగత శ్రద్ధతో పనిచేయాలని కలెక్టర్ అన్నారు
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అబ్దుల్ హమీద్, పీఆర్ ఇఇ రఘువీరారెడ్డి, డిపివో కె. రంగాచారి, డిఆర్డీవో జి. రాంరెడ్డి, డిఎల్పీఓ గంగ భవాని, మండల ప్రత్యేక అధికారులు, ఎంపిడివోలు, ఎంపీవోలు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పౌరసంబంధాల అధికారి, జనగామచే జారిచేయనైనది.

Share This Post