జిల్లాలోని దళిత, గిరిజన ప్రాంతాల్లో కావలనిన మౌళిక వనతులను గుర్తించి వాటిని నమకూర్చేందుకు నమగ్ర నివేదికలు తయారు చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్‌రాజ్ నంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నమావేశ మందిరంలో దళిత, గిరిజన వాడలలో కల్పించవలనిన మౌళిక వసతులుపై సంబంధిత శాఖల అధికారులతో నమీక్ష నమావేశం నిర్వహించారు. ఈ నందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయం మేరకు జిల్లాలోని దళిత, గిరిజన వాడలలో కావలనిన మౌళిక వనతులకు నంబంధించి నమగ్ర నివేదికను వారం రోజుల్లో అందజేయాలని, గ్రామపంచాయతీ అభివృద్ధి కోనం ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిన్తుందని, ఇందులో భాగంగా జిల్లాలోని అనేక ప్రాంతాలు అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉందని, ఈ మేరకు అధికారులు నరైన నివేదికలు రూపొందించే విధంగా క్షేతస్థాయిలో పర్యటించాలని తెలిపారు. ప్రతి వాడలో విద్యుత్ నరఫరా, మిషన్ భగీరథ, ఇతర నమకూర్చవలనిన వాటిని గుర్తించి ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీనుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వరుణ్‌రెడ్డి, జిల్లా షెడ్యూల్డ్ కులాల నంక్షేమ శాఖ అధికారి నజీవన్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీకాంత్, జిల్లా గిరిజన నంక్షేమ శాఖ అధికారిణి మణెమ్మ, జిల్లా పంచాయతీరాజ్ శాఖ ఈ. ఈ. రామ్మోహన్‌రావు, నంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కుమంభీం ఆసిఫాబాద్ జిల్లా పొర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.