దళితులు తరతరాలుగా ఎదుర్కొంటున్న ఆర్థిక, సామాజిక వివక్షను పోగొట్టేందుకే దళితబంధు పథకాన్ని గౌరవ ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అన్నారు. దళితుల మనోభావాలు, వారి స్థితిగతులు, ఆర్థిక అవసరాలను పరిశీలించి నాగర్ కర్నూలు జిల్లాలోని చారకొండ మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు.
చారగొండ మండలంలోని 17 గ్రామ పంచాయతీలకు 17 మంది జిల్లా అధికారులను గ్రామ స్థాయి ప్రత్యేక అధికారులగా నియమించారు.
మంగళవారం దళిత బంధు పథకం అమలు తీరు,అవగాహనా,గ్రామాల దళిత బంధు కమిటీ ఏర్పాటు తదితర అంశాలపై జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
సమీక్షలో జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్ మాట్లాడుతూ…..
దళిత బంధు పధకం ద్వారా దళితులను ఆర్థికంగా, వ్యాపారవర్గంగా అభివృద్ధి చెందేలా వారికి అవగహన కల్పించి చారగొండ మండలాన్ని రాష్ట్రంలోనే ఓ మెడల్ మండలంగా తీర్చిదిద్దే లా అధికారులు కృషి చేయాల్సి ఉంటుందన్నారు.
మండలంలోని ప్రతి గ్రామ పంచాయతీలో దళిత బంధు కమిటీలను ఏర్పాట్లు చేయాలన్నారు.
కమిటీ సభ్యుల ఏర్పాట్లలో చురుగ్గా ఉండి స్థానికంగా ఉండే 6 మంది సభ్యుల ఎంపికలో 50% మహిళలు ఉండేలా అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
కమిటీ సభ్యులకు ఎలాంటి అధికారలుగాని, జీతభత్యాలుగానీ, లబ్ధిదారుల ఎంపికలు చేసే అధికారాలు గాని ఉండవన్నారు.
కేవలం అధికారులకు సమాచారం ఇచ్చేందుకు, ప్రజలకు అవగాహన కల్పించేందుకు మాత్రమే కమిటీ పనిచేస్తుందన్నారు.
దళిత బంధు పథకం అమలు రాష్ట్ర ప్రభుత్వం విధివిధానాలు, మార్గదర్శకాల ప్రకారం మాత్రమే పనిచేయాల్సి ఉంటుందని అధికారులకు ఆయన ఆదేశించారు.
దళిత బంధు పథకం ఉద్దేశం విధివిధానాలను జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడి రామ్ లాల్ అధికారులకు అవగాహన కల్పించారు.
ఈ సమావేశంలో పిడి డిఆర్డిఎ నర్సింగ్ రావు, ఎల్ డి యం కౌశల్, గ్రామస్థాయి ప్రత్యేక అధికారులుగా కేటాయించిన జిల్లా అధికారులు చారగొండ ఎంపిడిఓ, తాహసిల్దార్ తదితరులు పాల్గొన్నారు.