దళిత బందు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి:: జిల్లా కలెక్టర్ జి.రవి

ప్రచురణార్థం—-1

తేదీ.24.5.2022

ప్రచురణార్థం----1 తేదీ.24.5.2022 దళిత బందు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి:: జిల్లా కలెక్టర్ జి.రవి 69 మంది దళిత బంధు లబ్ధిదారులకు ఆస్తుల పంపిణీ దళితుల సంరక్షణ కొరకు దళిత రక్షణ నిధి ఏర్పాటు దళిత బంధు పథకం దేశానికే దిక్సూచి కోరుట్ల నియోజకవర్గంలోని మెట్పల్లి ప్రాంతంలో దళిత బందు యూనిట్ల పంపిణీ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే తో కలిసి పాల్గొన్న జిల్లా కలెక్టర్ జగిత్యాల మే 24:- ప్రభుత్వం అందిస్తున్న దళిత బంధు పథకాన్ని లబ్ధిదారులు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోని , ఆర్థిక స్థిరత్వం సాధించాలని జిల్లా కలెక్టర్ జి రవి లబ్ధిదారులకు సూచించారు. మంగళవారం కోరుట్ల నియోజకవర్గంలోని ప్రాధమికంగా 69 దళిత బందు లబ్ధిదారులకు మెట్పల్లి ప్రాంతంలో నిర్వహించిన యూనిట్ల పంపిణీ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. దళిత బంధు పథకం పైలెట్ ప్రాజెక్టు కింద ప్రతి నియోజకవర్గ పరిధిలో 100 మంది లబ్ధిదారులను స్థానిక ఎమ్మెల్యేలు ఎంపిక చేసి, వారికి పథకాన్ని అమలు చేయడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు. జగిత్యాల జిల్లాలో కోరుట్ల నియోజకవర్గం పరిధిలో 100 మంది లబ్ధిదారుల జాబితాను అందరికంటే ముందు ఎమ్మెల్యే అందజేశారని కలెక్టర్ తెలిపారు. కోరుట్ల నియోజకవర్గం పరిధిలో 33 మంది లబ్ధిదారులకు ట్రాక్టర్లు, 33 మంది లబ్ధిదారులకు ప్యాసింజర్ వాహనాలు , 3 లబ్ధిదారులకు రిటైల్ సెక్టార్లో యూనిట్లను ఈరోజు పంపిణీ చేస్తున్నామని కలెక్టర్ అన్నారు.  దళిత బంధు పథకం పైలెట్ ప్రాజెక్టు కింద జిల్లాలో మొత్తం 345 మంది లబ్ధిదారులను ఎంపిక చేశామని, 118 మంది లబ్ధిదారులకు యూనిట్లను పూర్తిస్థాయి రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి గారి చే అందజేశామని కలెక్టర్ అన్నారు.    జిల్లాలో మరో 138 మంది దళిత బందు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలలో నిధులు జమ చేసి, రూ.30 వేలు విడుదల చేసేందుకు అనుమతులు జారీ చేశామని కలెక్టర్ తెలిపారు. మండలాల్లో దళిత బంధు యూనిట్ల గ్రౌండింగ్ పురోగతి మేరకు మిగిలిన నిధుల విడుదలకు బ్యాంకులకు ఆదేశాలు జారీ చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సీఎం కేసీఆర్ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 1500 మంది లబ్ధిదారులకు దళిత బంధు పథకం అమలు చేయాలని నిర్ణయించారని కలెక్టర్ అన్నారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న యూనిట్ల స్థాపించి దళితులు ఆర్థికంగా ఎదగాలని కలెక్టర్ సూచించారు. ప్రతి లబ్ధిదారులు ట్రాక్టర్లు, వాహనాలను మాత్రమే కొనుగోలు చేస్తే వ్యాపార అవకాశాలు చాలా దెబ్బతింటాయని, మన ఎదుగుదల పై ప్రభావం చూపుతుందని దీని పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు.  ప్రతి దళిత బంధు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో రూ.9.9 లక్షల నిధులు జమ చేస్తామని, మిగిలిన రూ.10వేలకు ప్రభుత్వం మరో 10వేలు జమ చేసి దళిత రక్షణ నిధి ఏర్పాటు చేస్తుందని కలెక్టర్ అన్నారు దళిత బంధు లబ్ధిదారులు భవిష్యత్తులో మరోసారి పేదరికంలోకి వెళ్లకుండా ఆపద సమయంలో దళిత రక్షణ నిధి ఉపయోగపడుతుందని కలెక్టర్ అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మాట్లాడుతూ దళిత బంధు పథకం దేశానికే దిక్సూచిగా నిలుస్తుందని అన్నారు దళితులు ఆర్థికంగా ఎదగాలని ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా దళిత పథకం రూపొందించారని, ప్రతి దళిత కుటుంబానికి ఎలాంటి బ్యాంక్ లింకేజీ లేకుండా వ్యాపారాల నిమిత్తం రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు.  ప్రభుత్వ లైసెన్స్ వ్యాపారాలలో ప్రభుత్వం దళితులకు రిజర్వేషన్లు కల్పిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. దేశంలోని 18 బిజెపి అధికార రాష్ట్రాలలో దళిత బంధు రైతుబంధు, కల్యాణలక్ష్మి, ఆసరా పింఛన్లు, 24 గంటల ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాలు లేవని ఎమ్మెల్యే అన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3 వేల మంది సోంత స్థలంలో ఇల్లు నిర్మించుకునే వారికి రూ.3 లక్షల ఆర్థిక సహాయం అందించే విధంగా సీఎం కేసీఆర్ కార్యాచరణ రూపొందిస్తారని ఎమ్మెల్యే అన్నారు.  దళిత బంధు లబ్ధిదారులు తమకు అందిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ కష్టపడి పనిచేయాలని, 2 సంవత్సరాల కాలంలో 3 రెట్లు అధికంగా సంపాదించి ఆర్థికంగా స్థిరపడాలని ఎమ్మెల్యే సూచించారు. ఆర్థికంగా ఎదిగిన పక్షంలో సమాజంలో వివక్ష వెనుకబాటుతనం నుంచి విడుదల లభిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు.  తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను అడ్డుకునే దిశగా కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని, రాష్ట్రాలకు రావాల్సిన రుణాలను నిలిపి వేయడం దారుణమని, కేంద్ర ప్రభుత్వానికి సైతం రుణాలు తీసుకునే హక్కు ఉండదని అన్నారు.  ఈ. డి. ఎస్సి కార్పొరేషన్ లక్ష్మీనారాయణ, 4 మండలాల జెడ్పిటిసిలు, ఎం.పి.పి.లు, ఎం.పి.టి.సి.లు, సర్పంచ్ లు,  సంబంధిత అధికారులు ప్రజా ప్రతినిధులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు జిల్లా పౌరసంబంధాల అధికారి జగిత్యాల జారీ చేయడమైనది
దళిత బందు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి:: జిల్లా కలెక్టర్ జి.రవి

69 మంది దళిత బంధు లబ్ధిదారులకు ఆస్తుల పంపిణీ

దళితుల సంరక్షణ కొరకు దళిత రక్షణ నిధి ఏర్పాటు

దళిత బంధు పథకం దేశానికే దిక్సూచి

కోరుట్ల నియోజకవర్గంలోని మెట్పల్లి ప్రాంతంలో దళిత బందు యూనిట్ల పంపిణీ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే తో కలిసి పాల్గొన్న జిల్లా కలెక్టర్

జగిత్యాల మే 24:- ప్రభుత్వం అందిస్తున్న దళిత బంధు పథకాన్ని లబ్ధిదారులు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోని , ఆర్థిక స్థిరత్వం సాధించాలని జిల్లా కలెక్టర్ జి రవి లబ్ధిదారులకు సూచించారు. మంగళవారం కోరుట్ల నియోజకవర్గంలోని ప్రాధమికంగా 69 దళిత బందు లబ్ధిదారులకు మెట్పల్లి ప్రాంతంలో నిర్వహించిన యూనిట్ల పంపిణీ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు.

దళిత బంధు పథకం పైలెట్ ప్రాజెక్టు కింద ప్రతి నియోజకవర్గ పరిధిలో 100 మంది లబ్ధిదారులను స్థానిక ఎమ్మెల్యేలు ఎంపిక చేసి, వారికి పథకాన్ని అమలు చేయడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు. జగిత్యాల జిల్లాలో కోరుట్ల నియోజకవర్గం పరిధిలో 100 మంది లబ్ధిదారుల జాబితాను అందరికంటే ముందు ఎమ్మెల్యే అందజేశారని కలెక్టర్ తెలిపారు. కోరుట్ల నియోజకవర్గం పరిధిలో 33 మంది లబ్ధిదారులకు ట్రాక్టర్లు, 33 మంది లబ్ధిదారులకు ప్యాసింజర్ వాహనాలు , 3 లబ్ధిదారులకు రిటైల్ సెక్టార్లో యూనిట్లను ఈరోజు పంపిణీ చేస్తున్నామని కలెక్టర్ అన్నారు.

దళిత బంధు పథకం పైలెట్ ప్రాజెక్టు కింద జిల్లాలో మొత్తం 345 మంది లబ్ధిదారులను ఎంపిక చేశామని, 118 మంది లబ్ధిదారులకు యూనిట్లను పూర్తిస్థాయి రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి గారి చే అందజేశామని కలెక్టర్ అన్నారు.

జిల్లాలో మరో 138 మంది దళిత బందు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలలో నిధులు జమ చేసి, రూ.30 వేలు విడుదల చేసేందుకు అనుమతులు జారీ చేశామని కలెక్టర్ తెలిపారు. మండలాల్లో దళిత బంధు యూనిట్ల గ్రౌండింగ్ పురోగతి మేరకు మిగిలిన నిధుల విడుదలకు బ్యాంకులకు ఆదేశాలు జారీ చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సీఎం కేసీఆర్ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 1500 మంది లబ్ధిదారులకు దళిత బంధు పథకం అమలు చేయాలని నిర్ణయించారని కలెక్టర్ అన్నారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న యూనిట్ల స్థాపించి దళితులు ఆర్థికంగా ఎదగాలని కలెక్టర్ సూచించారు. ప్రతి లబ్ధిదారులు ట్రాక్టర్లు, వాహనాలను మాత్రమే కొనుగోలు చేస్తే వ్యాపార అవకాశాలు చాలా దెబ్బతింటాయని, మన ఎదుగుదల పై ప్రభావం చూపుతుందని దీని పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు.

ప్రతి దళిత బంధు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో రూ.9.9 లక్షల నిధులు జమ చేస్తామని, మిగిలిన రూ.10వేలకు ప్రభుత్వం మరో 10వేలు జమ చేసి దళిత రక్షణ నిధి ఏర్పాటు చేస్తుందని కలెక్టర్ అన్నారు దళిత బంధు లబ్ధిదారులు భవిష్యత్తులో మరోసారి పేదరికంలోకి వెళ్లకుండా ఆపద సమయంలో దళిత రక్షణ నిధి ఉపయోగపడుతుందని కలెక్టర్ అన్నారు.

కార్యక్రమంలో పాల్గొన్న కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మాట్లాడుతూ దళిత బంధు పథకం దేశానికే దిక్సూచిగా నిలుస్తుందని అన్నారు దళితులు ఆర్థికంగా ఎదగాలని ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా దళిత పథకం రూపొందించారని, ప్రతి దళిత కుటుంబానికి ఎలాంటి బ్యాంక్ లింకేజీ లేకుండా వ్యాపారాల నిమిత్తం రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు.

ప్రభుత్వ లైసెన్స్ వ్యాపారాలలో ప్రభుత్వం దళితులకు రిజర్వేషన్లు కల్పిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. దేశంలోని 18 బిజెపి అధికార రాష్ట్రాలలో దళిత బంధు రైతుబంధు, కల్యాణలక్ష్మి, ఆసరా పింఛన్లు, 24 గంటల ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాలు లేవని ఎమ్మెల్యే అన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3 వేల మంది సోంత స్థలంలో ఇల్లు నిర్మించుకునే వారికి రూ.3 లక్షల ఆర్థిక సహాయం అందించే విధంగా సీఎం కేసీఆర్ కార్యాచరణ రూపొందిస్తారని ఎమ్మెల్యే అన్నారు.

దళిత బంధు లబ్ధిదారులు తమకు అందిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ కష్టపడి పనిచేయాలని, 2 సంవత్సరాల కాలంలో 3 రెట్లు అధికంగా సంపాదించి ఆర్థికంగా స్థిరపడాలని ఎమ్మెల్యే సూచించారు. ఆర్థికంగా ఎదిగిన పక్షంలో సమాజంలో వివక్ష వెనుకబాటుతనం నుంచి విడుదల లభిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను అడ్డుకునే దిశగా కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని, రాష్ట్రాలకు రావాల్సిన రుణాలను నిలిపి వేయడం దారుణమని, కేంద్ర ప్రభుత్వానికి సైతం రుణాలు తీసుకునే హక్కు ఉండదని అన్నారు.

ఈ. డి. ఎస్సి కార్పొరేషన్ లక్ష్మీనారాయణ, 4 మండలాల జెడ్పిటిసిలు, ఎం.పి.పి.లు, ఎం.పి.టి.సి.లు, సర్పంచ్ లు, సంబంధిత అధికారులు ప్రజా ప్రతినిధులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

జిల్లా పౌరసంబంధాల అధికారి జగిత్యాల జారీ చేయడమైనది

Share This Post