ప్రచరణార్థం
మహబూబాబాద్ డిసెంబరు 01.
నిర్దేశించుకున్న దళిత బంధు లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.
గురువారం కలెక్టర్ కార్యాలయంలో దళిత బంధు పథకం లక్ష్యాలను సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లబ్ది దారులు ఎంపిక చేసుకున్న పథకాలను వారికి అందించేలా అధికారులు కృషి చేయాలన్నారు.
పాడి పరిశ్రమ కోళ్ల పరిశ్రమలకు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు ఆయా పరిశ్రమలపై అవగాహన పరుస్తూ మంజూరు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ సమీక్ష సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడి బాలరాజు డి ఆర్ డి ఓ సన్యాసయ్య పశుసంవర్ధక శాఖ అధికారి సుధాకర్ ఉపాధి కల్పన అధికారి రామకృష్ణ మహిళా సంక్షేమ అధికారి నర్మద తదితరులు పాల్గొన్నారు