*దళిత బందు లబ్ధిదారులకు యూనిట్ మంజూరు పత్రాలు అంద చేసిన రాష్ట్ర ఐ.టి. పురపాలన,పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి కె.టి.అర్*.

నల్గొండ,మే 14.నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం లోని నిడమ నూరు,పెద్ద వూర,గుర్రం పోడ్ మండలం లకు చెందిన 19 మంది లబ్ది దారులకు దళిత బందు పథకం కింద యూనిట్ లు మంజూరు పత్రాలు రాష్ట్ర ఐ.టి.,పుర పాలన,పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి కె.టి.అర్ అంద చేశారు.శనివారం హలియా పట్టణం లో హలియా, నంది కొండ మున్సిపాలిటీ లలో 56 కోట్ల రూ.లతో చేపట్టిన పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు.సభ అనంతరం నాగార్జున సాగర్ నియోజక వర్గం లోని  నిడమానూరు మండలంలోని వల్లభా పురం గ్రామం కు చెందిన 15మంది,పెద్ద వూర మండలం లింగం పల్లి గ్రామం కు చెందిన ఇద్దరికీ,గుర్రం పొడ్ మండలము తేరేటి గూడెం గ్రామం కు చెందిన ఇద్దరికీ మొత్తం 19 మందీకి జిల్లాలో మొదటిగా దళిత బందు కింద నాన్ ట్రాన్స్పోర్ట్ యూనిట్ లు మంజూరు  పత్రాలు అందచేశారు.ఒక్కొకరికి 10 లక్షల రూ.లు దళిత బందు ఖాతాలలో జమ చేయడం జరిగింది.సమావేశం లో రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి,రాష్ట్ర రైతు బందు అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, నాగార్జున సాగర్ శాసన సభ్యులు నోముల భగత్,ఎం.ఎల్.సి. లుకోటి రెడ్డి, శాసన సభ్యులు రవీంద్ర కుమార్,జడ్ పి చైర్మన్ బండ నరేందర్ రెడ్డి,జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ , ఎస్.సి.కార్పొరేషన్ ఈ.డి.వెంకటేశం,జిల్లా ఎస్.సి. అభివృద్ధి శాఖ ఇంఛార్జి అధికారి రాజ్ కుమార్ లు తదితరులు పాల్గొన్నారు

దళిత బందు లబ్ధిదారులకు యూనిట్ మంజూరు పత్రాలు అంద చేసిన రాష్ట్ర ఐ.టి. పురపాలన,పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి కె.టి.అర్*.

Share This Post