దళిత బందు లబ్ధిదారులకు యూనిట్ల పంపిణీ : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

పత్రికా ప్రకటన.      తేది:28.04.2022, వనపర్తి.

అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతున్నదని, దళితుల ఆర్థిక అభివృద్ధి సాధించేందుకు దళిత బంధు కార్యక్రమం ప్రవేశపెట్టినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సూచించారు.
గురువారం వనపర్తి పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో దళిత బందు యూనిట్లను లబ్ధిదారులకు మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సమాజంలో సమున్నతంగా ఎదగాలని, అసమానతలు లేని సమాజం ఏర్పడాలని, అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తున్నదని ఆయన అన్నారు. అణచివేతకు గురైన దళితులకు అసరా అందించటం కోసమే దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టినట్లు ఆయన సూచించారు. అన్ని వర్గాల వారు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నట్లు ఆయన వివరించారు. విడతల వారీగా ప్రతి ఒక్క దళిత కుటుంబానికి దళితబంధు ఫలాలు అందేలా చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. దళితబంధు ద్వారా దళితుల జీవితాలలో వెలుగులు నిండాలని, వారి కాళ్ల మీద వాళ్లు నిలబడే విధంగా ఉపాధి కల్పిస్తున్నట్లు సూచించారు. లాభదాయకమైన, ఇష్టమైన, అనుభవం ఉన్న రంగానికి సంబంధించిన యూనిట్లనే ఎంచుకోవాలని, యూనిట్ల ఎంపికకు అధికారుల సహకారం తీసుకోవాలని ఆయన అన్నారు. దళిత బందు పథకాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని, అందరికీ ఆదర్శంగా నిలవాలని మంత్రి సూచించారు.
వనపర్తి జిల్లాలో పెబ్బేరు మండలం పెంచికలపాడు గ్రామానికి రెండు చొప్పున, ఘనపూర్ మండలం మల్కి మియాన్ పల్లి గ్రామానికి మూడు చొప్పున మొత్తం (5) దళితబంధు యూనిట్లను మంత్రి చేతుల మీదుగా అందజేసినట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా స్త్రీ నిధి క్రెడిట్ కో-అపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ యంత్రాలు, ఇతర పనిముట్లు కొనుగోలు చేసి అద్దెకు ఇచ్చే కేంద్రం ప్రారంభించి, స్త్రీ నిది నుండి మంజూరైన రెండు ట్రాక్టర్ లను లబ్ధిదారులకు అందజేసినట్లు ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశిష్ సంగ్వాన్, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి మల్లికార్జున్, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
………
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post