దళిత బంధు’కు చెల్కలపల్లి, ఎల్లాయపల్లి గ్రామాలు ఎంపిక

సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన గ్రామస్తులు

దళిత బంధు పథకానికి మొదటి విడతలో సిద్దిపేట నియోజకవర్గం చిన్నకోడూర్ మండలంలోని చెల్కలపల్లి, ఎల్లాయపల్లి గ్రామాలు ఎంపికయ్యాయి. ఈ మేరకు సిద్దిపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో గురువారం రాత్రి ఎల్లాయపల్లి గ్రామస్తులు సంబురంతో రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావును కలిశారు. పూల వృక్షాన్ని అందించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ దళితుల జీవితాల్లో వెలుగులు నింపే దళిత బంధు పథకం తమకు వరంగా నియోజకవర్గంలోనే మొదటి గ్రామాలుగా ఎంపిక చేసి అందిస్తున్నందుకు తమకు గర్వంగా ఉన్నదని, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి వర్యులు హరీశ్ రావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లక్కపాక జీవిత-బాబు, రామంచ రమేశ్, రామంచ నర్సయ్య, శంకర్, శ్రీనివాస్, లక్కపాక మల్లయ్య, ఎల్లయ్య, గొట్టిముక్కల భూమయ్యలతో పాటు మండల వైస్ ఏంపీపీ కీసర పాపయ్య తదితరులు పాల్గొన్నారు.

Share This Post