దళిత బంధులో మిగిలిన యూనిట్ లు వెంటనే గ్రౌండింగ్ చేయాలి …. జిల్లా కలెక్టర్ కె. శశాంక

దళిత బంధులో మిగిలిన యూనిట్ లు వెంటనే గ్రౌండింగ్ చేయాలి …. జిల్లా కలెక్టర్ కె. శశాంక

ప్రచురణార్థం

దళిత బంధులో మిగిలిన యూనిట్ లు వెంటనే గ్రౌండింగ్ చేయాలి …. జిల్లా కలెక్టర్ కె. శశాంక

మహబూబాబాద్, ఏప్రిల్ -28:

దళిత బంధు లో మిగిలిన యూనిట్ లను వెంటనే గ్రౌండింగ్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక అధికారులను ఆదేశించారు.

గురువారం కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశంలో జిల్లా కలెక్టర్ కె. శశాంక నియోజక వర్గాలలో దళిత బంధు పథకంలో ఇంకను గ్రౌండింగ్ చేయవలసిన యూనిట్ లపై ప్రత్యేక అధికారులు, రిసోర్స్ పర్సన్ లచే సమీక్షించారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, దళిత బంధు లబ్ధిదారులకు అందించాల్సిన మిగిలిన ఆస్తుల పంపిణీని జిల్లాలో త్వరితగతిన పూర్తిచేయుటకు అధికారులు తగు చర్యలు చేపట్టాలని, యూనిట్ కొనుగోలు చేసే సందర్భంగా సరి అయిన బిల్లులు తీసుకొని భవిష్యత్తులో ఆ కంపెనీ ద్వారా గ్యారంటీ, వారంటి, సర్వీసింగ్ సేవలు పూర్తిగా అందే విధంగా చూడాలని, రిసోర్స్ పర్సన్ అలసత్వం ప్రదర్శించ రాదని, కొటేషన్ తీసుకొని, యూనిట్ లను మంజూరు చేసుకొని మే మొదటి వారంలోగా గ్రౌండింగ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

ఈ సందర్భంగా యూనిట్ ల వారీగా ముందస్తు ఏర్పాట్లు, కొటేషన్, గ్రౌండింగ్ చేసే వాటిపై నియోజక వర్గం వారీగా సమీక్షించారు.

ఈ కార్యక్రమంలో ఈ.డి. ఎస్సీ కార్పొరేషన్ బాల రాజు, ప్రత్యేక అధికారులు, రిసోర్స్ పర్సన్ లు, సంబంధిత తహశీల్దార్లు, ఎంపిడిఓ లు, తదితరులు పాల్గొన్నారు.

—————————————————-
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, మహబూబాబాద్ చే జారీ చేయనైనది.

Share This Post