ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ శశాంక, జెడ్పీ చైర్ పర్సన్ కుమారి బిందు, ఎమ్మెల్సీ తక్కెలపళ్లి రవీందర్ రావు, వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ వాసుదేవ రెడ్డి, ఎమ్మెల్యే శంకర్ నాయక్, మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఫరీద్, దళిత బంధు స్పెషల్ ఆఫీసర్ సన్యాసయ్య, జిల్లా ఇతర అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.
*మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు మాట్లాడుతూ
గౌరవ సీఎం కేసిఆర్ గారి మానస పుత్రిక ఈ దళిత బంధు పథకం.
దళిత కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు, సమాజంలో అందరితో సమానంగా వారు వృద్ధిలోకి రావాలని, ఆ కుటుంబాలు భవిష్యత్లో ఇక వెనక్కి తిరిగి చూడకుండా ఉండడం కోసం సీఎం కేసిఆర్ గారు ఈ పథకాన్ని తెచ్చారు.
ప్రయోగాత్మకంగా హుజూరాబాద్ లో చేపట్టి విజయవంతం చేశారు.
అనంతరం ఇపుడు ప్రతి నియోజకవర్గంలో 100 మందికి లబ్ది చేకూర్చాలని, మార్చి 5వ తేదీ లోపు వీరిని గ్రౌండింగ్ చేయాలని సీఎం కేసిఆర్ గారి ఆలోచన.
ఈ వందమంది ఎంపిక నియోజక వర్గంలోని తక్కువ మంది దళిత కుటుంబాలు ఉన్న గ్రామాలను ఎంపిక చేసి అక్కడి కుటుంబాలన్నిటిని ఎంపిక చేయడం ద్వారా పూర్తి స్థాయిలో గ్రామంలోని దళిత కుటుంబాలన్ని మొత్తం లబ్ది పొందుతాయి. కాబట్టి ఈ పద్దతిలో లబ్ది దారులని ఎంపిక చేయాలనేది ఆలోచన.
ఇందుకు ఎన్ని గ్రామాలు ఎక్కువగా ఎంపిక చేస్తే అంత మంచిది.
ఈ వంద మంది ఎంపిక అనంతరం రానున్న ఆర్థిక సంవత్సరంలో మార్చి నెలలో 2000 మంది చొప్పున ప్రతి నియోజక వర్గంలో ఎంపిక చేయనున్నారు. అప్పుడు మనం లబ్ది దారుల ఎంపికలో ఛాయిస్ తీసుకోవచ్చు.
ఇప్పుడు మాత్రం తక్కువ మంది దళిత కుటుంబాలు ఉన్న గ్రామాలు గుర్తించి అక్కడి దళిత కుటుంబాలు అన్నిటినీ పూర్తి స్థాయిలో ఎంపిక చేయాలి.
దళిత బంధు పథకం కింద లబ్ధి దారులకు 10 లక్షల రూపాయలతో పాటు నిధిని ఏర్పాటు చేయబోతున్నాం. ఇన్సూరెన్స్ కూడా ఇస్తున్నాం. కాబట్టి దీనిపై పకడ్బందీగా ప్రణాళిక సిద్ధం చేయాలి.
వ్యవసాయం చేసే దళితులకు ఏమైనా సాయం చేయగలమా? అసైన్డ్ భూములు ఉంటే వాటి అభివృద్ధికి సాయం చేయడంపై ఆలోచించాలి.
కోళ్ళ ఫారాలు, పాలు, గేదెలు, వంటి వాటి గురించి ఆలోచించాలి.
గతంలో కొన్ని చోట్ల పాడి గేదెలు పెద్ద ఎత్తున ఇచ్చారు. అక్కడ వారికి లాభం జరిగిందా అనేది స్టడీ చేయాలి.
మన దగ్గర అవసరం ఉన్న ఉత్పత్తులు, మార్కెటింగ్ లాభాల పై అధ్యయనం చేయాలి.
ఆ కుటుంబాలు ఈ పథకం ద్వారా దినదినాభివృద్ధి చెందాలి. భవిష్యత్లో వెనక్కి తిరిగి చూడకూడదు.
ఏయే గ్రామాలలో ఎస్సీలు ఎక్కువగా ఉన్నారు.. ఆ గ్రామాల జాబితా ఉండాలి.
గతంలో విజయవంతమైన కేస్ స్టడీస్ ఉండి, వాటి అనుభవాల ద్వారా నిర్ణయం తీసుకుంటే దళిత కుటుంబాలకు మేలు జరుగుతుంది.
ఈ పథకంపై ప్రజల అనుమానాలు ఏమున్నా నివృత్తి చేయాలి.
సమయం తక్కువ ఉన్నందున వెంటనే దీనిపై దృష్టి పెట్టి వేగవంతం చేయాలి.
